ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలన భీతావహ పాలన..పూర్తిగా ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు ఉమ్మడి ఏపీలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశాడు. అప్పుడు వామపక్షాలు చంద్రబాబును ప్రపంచ బ్యాంకు జీతగాడు అంటూ విమర్శించేవి..అలాంటి తమ జీతగాడికి ఏకంగా ప్రపంచబ్యాంకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం ల్యాండ్‌పూలింగ్ పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు సమీకరించిన సంగతి తెల్సిందే. అయితే చంద్రబాబు మాత్రం రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛంధంగా ఇచ్చారంటూ ప్రచారం చేసుకున్నాడు..అలాగే రాజధాని నిర్మాణానికి మాకు రైతులు భూములు ఇచ్చారు.. మీరు మాకు రుణం ఇవ్వండి అంటూ ప్రపంచ బ్యాంకుకు వెళ్లాడు. బాబుగారి పాత దోస్తానాతో ప్రపంచ బ్యాంకు అసలు ఏపీకి పోయి అక్కడి పరిస్థితి ఏంటో చూసి రండి..ఆ తర్వాత రుణం గురించి ఆలోచిద్దామంటూ కొంత మంది ప్రతినిధులను ఏపీకి పంపింది. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు రాజధాని ప్రాంతంలో టూర్ ఖరారు కాగానే చంద్రబాబు అలర్ట్ అయ్యాడు. తమ పార్టీకే చెందిన కొంత మంది భూములు ఇచ్చిన రైతులనే వారు కలిసేలా..వారు బాబుగారి మీద నమ్మకంతోనే
మేము భూములు సంతోషంగా ఇచ్చాం అని చెప్పేలా చేశాడు. అయితే ల్యాండ్‌ఫూలింగ్‌ను పూర్తిగా వ్యతిరేకించిన బేతంపూడి, ఉండవల్లి గ్రామాల రైతులు అసలు వాస్తవాలను ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు వివరించారు. తమను అధికారులు, అధికార టీడీపీకి చెందిన రాజకీయ పెద్దలు,గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి భూములు ఇవ్వాల్సిందే లేకుంటే మీరు ఇబ్బందులు ఎదుర్కుంటారంటూ బెదిరించారని రైతులు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు తెలిపారు.దీంతో అమరావతి భూసమీకరణ గుట్టు ప్రపంచ బ్యాంకుకు తెలిసిపోయింది . ల్యాండ్‌పూలింగ్ ద్వారా రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారన్న చంద్రబాబు వాదనలో పస లేదని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు గ్రహించారు. సామాజిక, ఆర్థిక, పర్యావరణం వంటి అంశాలతోపాటు ఆహారభద్రతపైనా సర్కారు చెప్పిన మాటల్లో నిజం లేదని ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది. అమరావతిలో అసలేం జరుగుతోందో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఓ నివేదికను తమ డైరెక్టర్లకు అందించిందని సమాచారం.
ల్యాండ్‌పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆ నివేదికలో వెల్లడించింది. పదేళ్ల కౌలుతోపాటు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యభీమా, రుణమాఫీ చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం తమకు భూములు ఇచ్చే ముందు హామీ ఇచ్చినది..కానీ ఇప్పటివరకు అమలు చేయలేదని తమ తనిఖీలో వెల్లడైందని తెలిపింది. అలాగే ప్లాటు సైజు తగ్గించి ఇచ్చారని, మ్యాప్‌లో ప్లాటుకు, క్షేత్రస్థాయిలో ప్లాటుకు పొంతన లేదని, అసలు రాజధానిలో ముందుగా ప్రభుత్వ పెద్దలు, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల సంబంధికులకు ముందు వరుసలో ఫ్లాట్లు కేటాయించారని, భూములు ఇచ్చిన తమకు ఎక్కడో మారుమూల ఇచ్చారంటూ పూలింగ్ రైతులు వాపోయినట్లు ప్రతినిధుల బృందం నివేదికలో వెల్లడించింది. ప్రపంచబ్యాంక్ రాజధానిలో ప్రాజెక్టుకు అందించే ఆర్థిక సాయం 93 శాతం ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించిందేనంటూ ఈ ప్రాజెక్టుతో సామాజిక అంశాలు, జీవనోపాధి, ఆహార భద్రతపైన తీవ్ర ఆరోపణలున్నాయని నివేదికలో వెల్లడైంది., చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా చేపట్టిన ల్యాండ్‌పూలింగ్‌పై పునర్విచారణ చేసిన తరువాతనే రాజధానిలో ప్రాజెక్టుకు రుణం మంజూరుపై నిర్ణయం తీసుకోవాలని ప్రపంచబ్యాంక్ తనిఖీ బృందం బ్యాంకు డైరెక్టర్లకు సలహా ఇచ్చిందని సమాచారం. దీంతో ప్రపంచ బ్యాంకు తాజానివేదిక ప్రకారం అమరావతి రాజధాని నిర్మాణానికిగాను చంద్రబాబు ప్రభుత్వానికి రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు పునరాలోచనలో పడింది. ల్యాండ్‌పూలింగ్ గోల్‌మాల్ అన్నీ తేలాక పారదర్శకంగా ఉంటే రుణం ఇద్దాం లేకుంటే లేదు అని ప్రపంచ బ్యాంకు డిసైడ్ అయిందని సమాచారం. మొత్తంగా అమరావతి రాజధాని నిర్మాణానికి ఇప్పట్లో ప్రపంచ బ్యాంకు నుంచి రుణం వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రపంచ బ్యాంకు జీతగాడిగా పేరుగాంచిన చంద్రబాబుకు ఇది జీర్ణించుకోలేని పరిణామం.