Home / ANDHRAPRADESH / అమరావతి సాక్షిగా చంద్రబాబు పరువు తీసిన లోకేష్…!

అమరావతి సాక్షిగా చంద్రబాబు పరువు తీసిన లోకేష్…!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుది గొప్పలు చెప్పుకోవడంతో పాటు, చారణా పనికి బారణా పబ్లిసిటీ చేయించుకునే బాపతు. బాబుగారికి ఎంత పబ్లిసిటీ పిచ్చి ఉందో తెలుగు ప్రజలందరికీ
తెల్సిందే..పబ్లిసిటీలోతండ్రిని మించి పోతున్నాడు బాబుగారి కుమారుడు ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్..ఐటీ శాఖ‌ మంత్రిగా వైజాగ్‌ను ఐటీ రాజధానిగా చేస్తానని, తనకున్న పరిచయాలతో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలను ఏపీకి తీసుకువస్తానని బిల్డప్ ఇచ్చిన లోకేష్ ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరులాగా మౌలిక సౌకర్యాలు, అంతర్జాతీయ విద్యాసౌకర్యాలు, ట్రావెలింగ్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల వైజాగ్‌కు ఐటీ కంపెనీలు రావని తేల్చేశాడు..అయితే మరో పక్క అమరావతిలో పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు ఏర్పాటు కాబోతున్నాయంటూ బాబుగారి తరహాలోనే గొప్పలు చెప్పాడు..తాజాగా లోకేష్ అత్యుత్సాహంతో చేసిన పనికి చంద్రబాబు ప్రభుత్వం పరువు పోయినట్లయింది. డెల్ టెక్నాలజీస్‌కు చెందిన అనుబంధ కంపెనీ VVM wear INC. ప్రతినిధులు కొద్దిరోజుల కింద అమరావతిలో లోకేష్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో కంపెనీని ఏర్పాటు చేయాల్సిందిగా ఆ ప్రతినిధులను లోకేష్ ఓకే చెప్పగా..ఆ కంపెనీ ప్రతినిధులు ఓకే చెప్పారు. దఈ నేపథ‌్యంలో అమరావతిలో కంపెనీలు ఏర్పాటు చేయటానికి గల సౌకర్యాలు, సాధ్యాసాధ్యాలేంటో పరిశీలించమని ఆ కంపెనీ తమ ప్రతినిధులను పంపింది..వారు ప్రాథమికంగా పరిశీలించి కంపెనీ స్థాపించడానికి ఓకే చెప్పారు. .దీంతో మంత్రి లోకేష్ కార్యాలయం అత్యుత్సాహం ప్రదర్శించింది..అమరావతిలో డెల్ టెక్నాలజీ అనుబంధ సంస్థ ఐటీ కంపెనీ ఏర్పాటు చేయబోతుందని , దాదాపు 4 వేల ఉద్యోగాలు రాబోతున్నట్లు అధికారికంగా డప్పు కొట్టారు..దీంతో సదరు VVM wear INC. కంపెనీ షాక్ అయింది..అసలు ప్రాథమిక దశలోనే సమాచారాన్ని బయటకు లీక్ చేయడం, ఏకంగా నాలుగు వేల మందికి ఉద్యోగ అవకాశాలు అంటూ లోకేష్ బ్యాచ్ చెప్పుకోవడంపై ఆ కంపెనీ సీరియస్ అయింది..వీవీఎమ్ వేర్ కంపెనీ ఆల్రెడీ న్యూయార్క్ స్టాక్ ఎంక్సేజీలో లిస్ట్ అయిన కంపెనీ. . దీంతో లోకేష అండ్ బ్యాచ్ చేసిన పని వీవీఎం కంపెనీని అంతర్జాతీయంగా తీవ్ర ఇరకాటంలో పడేయడంతో ఆ కంపెనీ ప్ర‌తినిధులు వెంట‌నే ప్ర‌భుత్వంతో సంప్ర‌దించి సమాచార శాఖ కమిషనర్‌తోనే ఈ వార్తకు ఖండన ఇప్పించారు. నాలుగు వేల ఉద్యోగాలపై ఇప్పుడే హామీ ఇవ్వలేమని కంపెనీ ఏర్పాటు విషయం ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది..అసలు ఎప్పుడు ఏర్పాటు చేస్తాం అనేది తర్వాత ప్రకటిస్తాం అన్నది ఆ ఖండన సారాంశం. ఇఫ్పుడే ఏకంగా నాలుగు వేల ఉద్యోగాలు వస్తున్నాయని ప్రకటించటం సరికాదని కంపెనీ ప్ర‌తినిధులు ఏపీ ఐటీ శాఖకు గ‌ట్టి క్లాస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. లోకేష్ చేసిన అత్యుత్సాహంతో సదరు కంపెనీ అమరావతిలో కంపెనీ పెట్టే విషయంలో ఆలోచనలో పడినట్లు సమాచారం..మొత్తానికి లోకేష్ పబ్లిసిటీ పిచ్చి చంద్రబాబు పరువు తీసిందనే చెప్పాలి..పబ్లిసిటీ పిచ్చితో తండ్రీ కొడుకులు ఒకరిని మించి మరొకరు రాష్ట్రాన్ని ముంచేస్తున్నారని ఏపీ ప్రజలు నెత్తీ నోరు బాదుకుంటున్నారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat