కుమారీ 21 ఎఫ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా పటేల్ టాలీవుడ్ లో దూసుకుపోతున్నది. అయితే, కుమారీ 21 ఎఫ్ తరువాత హెబ్బా పటేల్ నటించిన చిత్రాలు పరాజయపాలయినా.. తను నటించిన పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. అనంతరం హీరో నిఖిల్‌తో నటించి ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వచ్చిందని అనుకున్నారంతా.. కానీ తరువాత తాను చేసిన రెండు సినిమాలు పరాజయపాలు కావడంతో, మళ్లీ ఓ మంచి హిట్ కోసం హెబ్బా పటేల్ ఎదురుచూస్తోంది.
అలాంటి హిట్ ను అందిస్తుందనే నమ్మకంతోనే ఆమె ‘ఏంజెల్’ సినిమా చేసింది. ఈ సినిమా రిలీజ్ కోసం అందరికంటే ఎక్కువగా ఆమెనే ఎదురుచూస్తోంది.
అయితే, ఏంజెల్ సినిమాకు సంబంధించి మీడియాతో ముచ్చటిస్తూ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది హెబ్బా పటేల్. ఒక వేళ మీరు చేసిన సినిమా ప్లాప్ అయితే ఎలా స్పందిస్తారు? అని ఓ విలేఖరు ప్రశ్నించగా.. తాను చేసిన సినిమా ఏదైనా ప్లాప్ అయితే ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకూ ఏడుస్తూనే ఉంటానని హెబ్బా చెప్పింది. ఆ తరువాత నెమ్మదిగా మనసు కుదుట పట్డాడక నెక్స్ట్ మూవీపై దృష్టి పెడతానని చెప్పుకొచ్చింది.