బాలీవుడ్ భామ దీపికా పదుకునే ప్రపంచంలోనే అత్యధిక మొత్తంలో పారితోషికం తీసుకోవడమే కాదు.. తన శృంగార సంబంధాలు సృష్టించిన సంచనాలు కూడా ఎక్కువే. కాగా, మొన్నీమధ్య హేమా మాలిని బయోగ్రఫీ లాంచ్ కార్యక్రమానికి హాజరైన దీపికా పదుకొనే జీవితంలో శృంగారం అనే అంశంపై మాట్లాడింది. సరైన శృంగార భాగస్వామిని ఎంచుకోవటం చాలా కష్టమైన పని అని, భాగస్వామి ఎదుగుదలను, అభిరుచుల్ని గౌరవించేవారు దొరకడం చాలా కష్టమని బాలీవుడ్ అందాల తార దీపికా పడుకునె అభిప్రాయ పడింది.
“శృంగార సంబంధాలకు సంబంధించి చెప్పాలంటే.. అవి ఎంతో వివాదాస్పదమైనవి. ఎందుకంటే మన సక్సెస్ ను, అభిరుచుల్ని, మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నామనేది అర్థం చేసుకుని, మనం అతనికంటే ఎక్కువ డబ్బు సంపాదించినా మనల్ని ప్రేమిస్తూ.. తోడుండగలిగేవారిని దొరకబట్టడం చాలా కష్టం. అందుకే ఒక సంబంధంలో కొనసాగడం చాలా కష్టంతో కూడుకున్న పని.” అని దీపికా వెల్లడించింది.