కెరీర్ ప్రారంభంలోనే తన అందచందాలు, అభినయంతో కుర్రకారు హృదయాలను దోచుకున్న హీరోయిన్ ఎవరంటే.. టక్కున వచ్చే సమాధానం కాజల్. కాజల్ సినీ ఇండస్ర్టీలోకి అడుగుపెట్టి దాదాపు పదేళ్లు పూర్తయ్యాయి. కెరీర్ ఆరంభం నుంచే విజయాలతో సంబంధం లేకుండా..వరుస సినిమాలు చేస్తోంది. మధ్య.. మధ్యలో కొత్త భామలు ఎంట్రీ ఇచ్చినా.. వారికి సైతం పోటీనిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే 50 సినిమాలు పూర్తిచేసుకున్న ఈమె తెలుగుతో పాటు తమిళ భాష చిత్రాల్లో కూడా తన సత్తా చాటుతోంది.
తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వీక్నెస్‌ను బయట పెట్టింది ఈ ముద్దుగుమ్మ. తనకు ప్రతిరోజు పండుగేనని.. సినిమా రిలీజైనా.. సినిమాలో తాను బాగా నటించానని అభిమానులు కితాబిచ్చినా.. షూటింగ్ సమయంలో తనను ఎవరైనా పొగిడినా, సహచర నటీనటులందరూ తనను మెచ్చుకున్నా.. ఇందులో ఏది జరిగినా తనకు ప్రతిరోజు పండగంటోంది కాజల్.
అయితే, ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కళ్యాణ్ రామ్‌తో కలిసి ఎమ్మెల్యే అనే సినిమాలో మాత్రమే నటిస్తోంది.