మళయాళ సినీ ఇండస్ర్టీలో లేడీ పృథ్వీరాజ్‌గా గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ పార్వతీ మీనన్. ప్రస్తుతం ఈమె అటు కుర్ర హీరోలతో నటిస్తూనే.. మరో పక్క సీనియర్ హీరోల పక్కనా నటిస్తోంది. కాగా, తాజాగా ఈమె సినీ ఇండస్ర్టీలోకి అడుగిడిన మొదట్లో తాను పడ్డ కష్టాల గురించి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
పార్వతీ మినన్ కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలేనని, కానీ సీన్ అంత వరకు పోలేదని చెప్పుకొచ్చింది. సినిమా అవకాశం ఇవ్వాలంటే తమతో పడకగదికి రావాలని చెప్పే మనుషులు మళయాల చిత్రసీమలో ఉన్నారంటూ పార్వతీ మీనన్ కొద్ది నెలల క్రితం చేసిన వ్యాఖ్యలు గగ్గోలు పుట్టించిన విషయం విధితమే. తమతో గడపమని నన్నూ అడిగారు. అదేదో తమ హక్కు అన్నట్లుగానే అడిగారు. నేను కాదని చెప్పేశాను. ఇండస్ర్టీలో మనకంటూ ఒక గుర్తింపు వచ్చాక మాత్రం వాళ్లు మనల్ని దాని కోసం అడగరు అని వెల్లడించింది పార్వతీ మీనన్. మళయాళంలో సీనియర్ నటులు, దర్శకులు చాలా బహిరంగంగానే తారలు తమతో గడపాల్సిందిగా అడుగుతుంటారనేది ఆమె మాట. అయితే అలాంటి వాళ్లతో నేనెప్పుడూ కలిసి పనిచేయలేదు. నేను చేసిన సినిమాలేవీ అలా చేసినవి కావు. కొతకాలంగా నాకు అవకావాలు తగ్గిపోవడానికి కూడా ఇదే కారణం అనుకుంటున్నా. అయినా పర్వాలేదు అని ధైర్యంగా చెప్పారు పార్వతి.
