రానున్న ఐదేళ్లలో దాదాపు రూ.7 లక్షల కోట్లతో 83 వేల కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేసే ప్రతిష్టాత్మక హైవే ప్రాజెక్ట్‌లకు మంగళవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిలో ప్రతిష్టాత్మక భారత్‌మాల ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా దేశవ్యాప్తంగా తొలి దశలో 20 వేల కిలోమీటర్ల మేర కొత్త హైవేలను నిర్మిస్తామని ఈ మధ్యే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించిన విషయం తెలిసిందే. వచ్చే ఐదేళ్లలో ఈ భారత్‌మాల ప్రాజెక్ట్‌తోపాటు 80 వేల కిలోమీటర్ల హైవేల అభివృద్ధికి మేర ఖర్చు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఎన్‌హెచ్‌డీపీ ప్రాజెక్ట్‌లో భాగంగా గతంలో 50 వేల కిలోమీటర్ల హైవేల నిర్మాణం జరగగా.. ఇప్పుడు భారత్‌మాల పేరుతో రెండో అతిపెద్ద హైవే నిర్మాణ ప్రాజెక్ట్‌కు కేంద్రం శ్రీకారం చుట్టబోతున్నది. సరుకు రవాణా కోసం ఉద్దేశించిన ఎకనమిక్ కారిడార్‌ల అభివృద్ధి కూడా ఈ హైవేల ప్రాజెక్ట్ కిందికే వస్తుందని సీనియర్ ప్రభుత్వ అధికారి వెల్లడించారు.21 వేల కిలోమీటర్ల మేర ఎకనమిక్ కారిడార్లను నిర్మించాలని గతంలో కేంద్రం నిర్ణయించింది. ముంబై-కొచ్చి-కన్యాకుమారి, బెంగళూరు-మంగళూరు, హైదరాబాద్-పనజీ, సంబల్‌పూర్-రాంచీ కారిడార్లు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. భారత్