Home / SLIDER / “నా తెలంగాణ కోటి రతనాల వీణ”థీమ్ సాంగ్ సూపర్

“నా తెలంగాణ కోటి రతనాల వీణ”థీమ్ సాంగ్ సూపర్

తెలంగాణ రాష్ట్ర  పర్యాటక శాఖ విడుదల చేసిన థీమ్ సాంగ్‌ అందరిని  ఆకట్టుకుంటోంది.  ఈ పాటలో తెలంగాణ అందాలను కళ్లకు కట్టేలా చూపించారు.  చారిత్రాత్మక కట్టడాలు, ప్రముఖ చెరువులు, జలపాతాలతో పాటు ఇక్కడి ప్రకృతి అందాలు, మట్టి వాసనలను అద్భుతంగా తెరకెక్కించారు‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ దాశరథి కృష్ణమాచార్యలు గీతంతో  పాట సాగుతుంది.. తెలంగాణ ప్రాంత ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు చిరునామాగా నిలిచే బతుకమ్మ, బోనాలను ప్రత్యేకంగా చూపించారు.  గోల్కొండ కోట, చార్మినార్, కాకతీయుల కళావైభవం, లక్నవరం చెరువు అందాలు వాహ్ అనేలా ఉన్నాయి.