ఎవరెన్ని అనుకున్నా సన్నీలియోన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. లక్కీగా మన తెలుగు సినిమాల్లో ఆమెను అడపా దడపా తీసుకోవడం వల్ల తెలుగు ఫంక్షన్లలో కూడా అడపా దడపా కనిపిస్తోంది. ఆ మధ్య ఓ బడా కాంట్రాక్టర్ అయితే.. తన బర్త్‌డేకు సన్నీని ప్రత్యేకంగా ఆహ్వానించుకుని డ్యాన్స్ చేయించుకుని చూసి తరించారు. త్వరలో రాబోయే గరుడవేగ సినిమాలో సన్నీలియోన్ స్పెషల్ నెంబర్ ఉంది. ఇప్పటికే ఈ పాట వీడియో క్లిప్పింగ్‌లు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తార్ రూపొందిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 27న జరగబోతోంది. ఈ ఫంక్షన్లో సన్నీలియోన్ స్పెషల్ అట్రాక్షన్ కాబోతుంది. ఆ ఫంక్షన్లో తన పాటకు తనే డ్యాన్స్ చేయబోతోంది. ఇంకేముందు జనాలకు భలే ఫ్రీ చాన్స్. ఇంకేముంది… లైవ్‌లో సన్నీ డ్యాన్స్ చూడ్డానికి లగెత్తడమే.
