Home / ANDHRAPRADESH / వైసీపీలోకి కాంగ్రెస్ మాజీ ఎంపీ …!

వైసీపీలోకి కాంగ్రెస్ మాజీ ఎంపీ …!

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం పెను మార్పులు చోటు చేసుకొంటున్నాయి .నిన్న మొన్నటి వరకు అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన చిన్న చితక నేతల దగ్గర నుండి సాక్షాత్తు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వరకు చేసే పలు అక్రమాలు ,అవినీతి కార్యక్రమాలపై అటు సామాన్య ప్రజలే కాకుండా ఇటు పలు రాజకీయ పార్టీలకు చెందిన బడా బడా నేతలు వరకు విరక్తి చెందారు .

అందులో భాగంగా ఇప్పటివరకు అధికార టీడీపీ పార్టీలోకి మొదలైన వలసలు ఇప్పుడు వైసీపీ వైపు మళ్ళాయి .ఇప్పటికే పల్నాడు లో తీవ్ర ప్రభావం చూపే మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి మనవడు కాసు మహేష్ రెడ్డి వైసీపీ లో చేరి పల్నాడు లో టీడీపీ పై సమరశంఖం పూరించాడు .అప్పటి నుండి రోజుకో ఒకరు చొప్పున వైసీపీ పార్టీలో చేరుతున్నరుణ ..తాజాగా మరో కాంగ్రెస్ మాజీ ఎంపీ వైసీపీ లో చేరడానికి సిద్ధమయ్యారు అని వార్తలు వస్తోన్నాయి .

అమలాపూరం కాంగ్రెస్ మాజీ ఎంపీ అయిన టి హర్షకుమార్ ఇటీవల విశాఖపట్నం జిల్లాలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ “నేను టీడీపీ ,బిజేపీ పార్టీల్లో చేరే ప్రసక్తే లేదు అని అవసరమైతే వైసీపీ లో చేరి అటు కేంద్రంలో ఉన్న బిజేపీ ,ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ ప్రభుత్వాలు చేస్తోన్న అక్రమాలపై పోరాటాలు చేస్తాను ..అందుకు త్వరలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ను
కలవనున్నట్లు ఆయన చెప్పారు అని వార్తలు వస్తోన్నాయి .