సినిమాలో మాస్ ఆడియన్స్ ఉర్రూతలూగించే సూపర్ స్టార్ రజనీకాంత్, ఎక్కువగా హిమాలయాల్లో సాధువులతో కలిసి ఆధ్యాత్మిక గురించి చర్చిస్తుంటారు. తాజాగా రజనీ, కొంత మంది స్నేహితులతో కలిసి హిమాలయాల్లో ఓ ఆశ్రమాన్ని నిర్మించారు.ఆధ్యాత్మిక గురువు పరమహంస యోగానంద శిష్యుడైన రజనీ, గురువు స్థాపించిన యెగోదా సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇండియా శత సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురుశరణ్ పేరుతో ఆశ్రమాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ ఆశ్రమాన్ని నవంబర్ 10న ప్రారంభించనున్నారు. ప్రస్తుతం 2.0, కాలా చిత్రాల షూటింగ్లో బిజీగా ఉన్నరజనీ.. వచ్చే సంవత్సరం ఈ ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. ఈ ఆశ్రమాన్ని రజనీ ఎంతో బలంగా విశ్వసించే బాబాజీ గుహకు దగ్గరల్లోనే నిర్మిస్తున్నట్టుగా తెలుస్తోంది.
అయితే గతంలోనూ రజనీకాంత్ హిమాలయాలకు వెళ్ళి మనోస్థైర్యాన్ని పొంది వచ్చిన సందర్భాలున్నాయని ఆయన అభిమానులు అంటున్నారు. అలాగే ఈ సారి కూడా వెళ్ళి వస్తాడని ఫ్యాన్స్ అభిప్రాయం. నిజానికి రజనీకాంత్‌కు ఆందోళన కలిగిస్తున్న అంశం కమల్ హాసన్ రాజకీయప్రవేశం. అంతేనా, రాజకీయాల్లో కమల్ చూపుతోన్న దూకుడు సైతం రజనీ గుండెల్లో గుబులు పుట్టిస్తోందని పరిశీలకులు అంటున్నారు. మరి కొంతమంది హిమాలయాల్లోకి వెళ్లి వస్తారా…. అక్కడే ఉండి పోతారా అని మాట్లడుతున్నారు.
