ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపు పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలని చూస్తున్న సంగతి తెల్సిందే .తాజాగా ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు సర్కారుకు ఝలక్ ఇచ్చింది .ఈ క్రమంలో కేంద్ర జలవనరుల ,ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి మీడియాతో మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి కోరిక మేరకు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపు పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంది .
కానీ పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్న ప్రధాన కాంట్రాక్ట్ సంస్థ ట్రాన్ స్ట్రాయ్ ను తప్పించడానికి సిద్ధంగా లేము అని ఆయన తేల్చిచెప్పారు .పోలవరం ప్రాజెక్టును నిర్మించడానికి కొత్తగా టెండర్లను పిలిస్తే సమయం ఆలస్యం కావడమే కాకుండా వ్యయం కూడా పెరుగుతుంది అని ఆయన తేల్చి చెప్పారు .ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయం గురించి చర్చిస్తాం అని ఆయన తెలిపారు .