Home / MOVIES / ఎన్టీఆర్‌పై శ్రీ‌కాంత్ కామెంట్స్‌ వింటే షాకే!
Telugu Hero Meka Srikanth Photos @ Kshatriya Interview

ఎన్టీఆర్‌పై శ్రీ‌కాంత్ కామెంట్స్‌ వింటే షాకే!

ఎన్టీఆర్ కెరీర్ ఎలా సాగిందో.. అంద‌రికీ తెలిసిందే. నంద‌మూరి వార‌స‌త్వంతో సినిమాల్లోకి ఎంట‌రైన ఈ న‌టరుద్ర‌డు ఎంట్రీతోనే ప‌రిశ్ర‌మ‌ను గ‌డ‌గ‌డ‌లాడించాడు. స్టూడెంట్ నెం.1తో నటుడిగా మంచి గుర్తింపు పొంది సింహాద్రితో ఏకంగా ఇండ‌స్ర్టీ హిట్ సాధించాడు. కానీ. ఆ త‌రువాత ఎన్టీఆర్ సినీ కెరీర్ కాస్త త‌డ‌బ‌డింది. వ‌రుస ఫ్లాప్‌లు రావ‌డం మొద‌ల‌య్యాయి. ఎక్క‌డో ఒక‌టి గుడ్డిలో మెల్ల‌లాగా హిట్‌లు వ‌చ్చాయే త‌ప్ప మిగిలిన‌వ‌న్నీ ఘోర ప‌రాజ‌యాలే అదే స‌మ‌యంలోనూ కుటుంబంలోనూ విభేదాలు త‌లెత్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు న‌ట‌రుద్రుడు ఎన్టీఆర్‌. ఒకానొక స‌మ‌యంలో తార‌క్ కెరీర్ ముగిసిపోయిన‌ట్లేన‌ని అంతా భావించారు. కానీ తార‌క్ ఓట‌మిని అంగీక‌రించ‌లేదు. ప‌డిలేచిన కెర‌టంలా తిరిగి మ‌ళ్లీ త‌న పోరాటాన్ని మొద‌లు పెట్టాడు. టెంప‌ర్‌తో ఉద‌యించిన సూర్యుడిలా.. త‌న‌లో దాగిన న‌ట విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించి శ‌భాష్ అనిపించుకున్నాడు. ఆ త‌రువాత నాన్న‌కు ప్రేమ‌తో క్లాస్ ఆడియ‌న్స్ మ‌న‌సుల్ని గెలుచుకుని త‌న స‌త్తా చాటాడు. జ‌న‌తా గ్యారేజ్ బాక్సాఫీస్‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించి త‌న స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు జై ల‌వ కుశ‌తో రావ‌ణాసుడిలా బాక్సాఫీస్‌ను చీల్చి చెండాడాడు. సింగిల్ హ్యాండ్‌తోనే తాను రికార్డుల‌ను తుడిచి పెట్టేయ‌గ‌ల‌న‌ని చాటిచెప్పాడు.
నిజానికి ఈ రోజుల్లో హీరోగా నిదొక్కుకోవ‌డం చాలా క‌ష్టం. ప‌ర్స‌నల్ విష‌యాల‌ను అధిగ‌మించి. ఎన్నో ఇబ్బందుల‌ను ఎదుర్కొని ఆడియ‌న్స్‌కు త‌గ్గ‌ట్టుగా మ‌ల్చుకోవ‌డం అంటే మామూలు విష‌యం కాదు. కానీ.. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి న‌టుడిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు తార‌క్‌. వ‌చ్చింది నంద‌మూరి వార‌స‌త్వంతోనే అయినా.. త‌న‌కూ ఇండ‌స్ర్టీలో ఓ స్థానం క‌ల్పించుకున్నారు.

ఇలా ఎన్నో క‌ష్ట న‌ష్టాల‌ను ఎదుర్కొని అంచెలంచెలుగా ఎదుగుతూ.. చివ‌రికి తిరుగులేని ఇమేజ్‌ను సొంతం చేసుకున్న తార‌క్ ఈ రోజు ఎంద‌రో యువ హీరోల‌కు ఆద‌ర్శం. ఈ మాట చెప్పింది మ‌రెవ‌రో కాదు సీనియ‌ర్ న‌టుడు శ్రీ‌కాంత్‌. తాను ఇబ్బందుల్లో ఉన్న స‌మ‌యంలో ఎవ‌రి స‌హాయం తీసుకోకుండా ఈ స్థాయికి ఎదిగింది తార‌క్ ఒక్క‌డేన‌ని ఆయ‌న ఆకాశానికి ఎత్తేశాడు. అత‌ని లాగానే త‌న కొడుకు కూడా ఎద‌గాల‌ని తాను కోరుకుంటున్న‌ట్లు చెప్పుకొచ్చారు శ్రీ‌కాంత్‌. అయితే తార‌క్‌లా ఎద‌గ‌డం అంత సులువైన విష‌యం కాద‌ని, తార‌క్‌ని ఫాలో అవ‌డం ఒక క‌లేన‌ని పేర్కొన్నారు. తార‌క్ ఎదుర్కొన్న‌వి మామూలు క‌ష్టాలు కావ‌ని, ఈ నాటి యంగ్ హీరోల‌కు అవి అసాధ్య‌మ‌ని త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat