కొత్త విషయాలను ప్రయత్నించే ప్రతిసారీ ఉత్సుకత ఉంటుంది. దానికి తోడు ఎక్కడో భయాందోళన కూడా చోటు చేసుకుంటాయి అని అంటున్నారు అనుష్క. దేవసేన పాత్రతో ఖండాంతరాల ఖ్యాతిని అందుకున్న అనుష్క మాట్లాడుతూ నాకు స్కూల్‌డేస్ నుంచి సినిమాల మీద ఆసక్తి ఉండేది. మా నాన్న నాకు మలయాళ సినిమాల గురించి చాలా చెప్పేవారు. భారతీయ చలన చిత్ర సీమ తలెత్తుకునేలా చేయగలదు మలయాళ సినిమా అని నాన్న చెపపిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. అప్పట్లో ముమ్మట్టి. శోభన నటించిన సినిమాలు ఎక్కువగా చూసేవాళ్లం. నేను సిని మాల్‌లోకి వచ్చాక మల్లువుడ్‌లో పవర్ఫుల్ స్ర్కిప్ట్‌లు వస్తాయని అర్థమైంది. కేరళ అభిమానులు ప్యాషన్ ఉన్న వారు. సినిమాల పట్ల మంచి అవగాహన ఉన్నవారు. అలాంటి మలబారు తీరంలో నేను అడుగుపెట్టాల్సి వస్తే, ఆ ప్రాజెక్ట్‌లో.. మంచి దర్శకుడు, మంచి హీరో.. ఉన్నారా? లేదా? అని ఆరా తీస్తాను. ఒకవేళ వీటిలో ఏది లేకపోకపోయినా.. కనీసం మంచి స్ర్కిప్ట్ ఉందనిపించినా నటిస్తాను అని చెప్పారు స్వీటీ.
