హీరోలను సరికొత్త కథలలో చూపించడం సుకుమార్ ధిట్ట. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఇమేజ్‌ను పక్కనపెట్టి పక్కా పల్లెటూరి పిల్లాడిలా నటింప చేస్తున్నారు సుకుమార్. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం రంగస్థలం 1985 టైటిల్‌లోనే ఇది పాతికేళ్లనాటి కథ అని చిత్ర యూనిట్ ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. నేటి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి అలనాటి వాతావరణాన్ని కళ్లకు కట్టేలా భారీ సెట్టింగ్ వేయించారు. అందులోనే హీరో హీరోయిన్ చరణ్, సమంతలపై ప్రస్తుతం కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే అభిమానులు మాత్రం కోపంగా ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్‌లుక్ దీపావళికి వస్తుందని అందరూ ఎదురు చూశారు. రాకపోవడంతో నిరుత్సాహ పడ్డారు. దీనిపై ఇంకా ప్రకటన కూడా చేయలేదు. సుకుమార్, రామ్‌చరణ్ డిసైడయ్యారు. అందుకు తగినట్లుగానే డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్‌లుక్ మాత్రమే కాదు. ఈ సినిమా పోస్టర్స్ అన్నీ పాతకాలం స్టైల్‌లో ఉండనుందని సమాచారం.
