ఇటీవలె అర్జున్‌రెడ్డి చిత్రంలో సంచలన విజయాన్ని అందుకున్న విజయదేవరకొండ ప్రస్తుతం అంగ్ర నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. కాగా, దాంతోపాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఓన మాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి క్లాసికల్ చిత్రాలకు దర్శకత్వం వహించి మంచి పేరు తెచ్చుకున్నాడు క్రాంతి మాధవ్.
అయితే ఇటీవల సునీల్ హీరోగా ఉంగరాల రాంబాబు వంటి డిజాస్టర్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. దాంతో ఉన్నపేరు పోయింది. ఇక ఇప్పుడేమో సక్కెస్తో మంచి స్పీడు మీద ఉన్న విజయదేవరకొండతో జత కలిశాడు. మరి హిట్ కొడతాడా? అనేది చూడాలి. ఇక హీరో విషయానికొస్తే పెళ్లిచూపులు చిత్రంతో ఇండస్ర్టీని తనవైపు తిప్పుకున్న విజయ్ ఇప్పుడు అర్జున్‌రెడ్డితో సంచలనం సృష్టించాడు. అలాంటి సమయంలో క్రాంతి మాధవన్‌తో సినిమానా..? అనేదే చిన్న అనుమానం. అయితే, క్రాంతి మాధవ్ మొదటి రెండు చిత్రాలకు మంచి పేరు వచ్చింది కాబట్టి ఈ కాంబినేషన్ వర్కవుట్ కావొచ్చు.