ఫిల్మ్‌నగర్‌లో వినబడుతున్న మాటల ప్రకారం విజయశాంతి సినిమా ఇండస్ర్టీలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. లేడీ అమితాబ్ అని పిలుపిచ్చుకునే ఏకైక నటి విజయశాంతి. అనేక హీరోల పక్కన గ్లామర్ హీరోయిన్‌గా నటించి.. ఆ తరువాత తానే ఓ సూపర్ హీరో అనే స్థాయికి ఎదిగిపోయింది. విజయవాంతి తాను నటించిన పలు లేడీ ఓరియంటెడ్ సినిమాలు కాసుల వర్షం కురిపించాయి. అలాంటి విజయశాంతి తాను కూడా రాజకీయాల్లో ప్రవేశించి సినిమాల్లో నటించడం మానివేసింది.
విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లి.. నటించడం మానివేసి తొమ్మిది సంవత్సరాల విరామం తరువాత మళ్లీ అదే జోష్‌తో ఇండస్ర్టీ రికార్డులు బద్దలు కొట్టిన మన మెగాస్టార్ చిరంజీవి సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న వార్త టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది. ఒకప్పుడు చిరంజీవి, విజయశాంతి జంట అంటే మాస్‌కే కాదు.. క్లాస్ ఆడియన్స్‌లో కూడా పిచ్చి క్రేజ్. ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్‌లో నటించిన ఈ ఇద్దరు హీరో హీరోయిన్‌గా కలిసి నటించిన ఆఖరి చిత్రం మెకానిక్ అల్లుడు. ఆ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు కూడా కీలక పాత్ర పోషించారు. తరువాత చిరు, విజయశాంతి జంటగా ఏ సినిమాలో కలిసి నటించే అవకాశం దక్కలేదు. ఒసెయ్ రాములమ్మ లాంటి సినిమాలతో తనకంటూ సపరేట్ గ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్నాక విజయశాంతి ఇతర హీరోల సినిమాల్లో నటించడం మానేసింది.
తాజాగా వచ్చిన వార్త నిజమైన పక్షంలో సుమారు పాతికేళ్ల తరువాత చిరు, విజయశాంతిని సైరా నరసింహారెడ్డి చిత్రంలో చూసే అవకాశాలు ఉన్నాయి. యూనిట్ నుంచి అనఫిషియల్‌గా అందిన సమాచారం మేరకు ఇందులో కీలకం అనిపించే చిన్న ముఖ్యమైన పాత్రకు విజయశాంతిని సంప్రదించాడట దర్శకుడు సురేందర్‌రెడ్డి. ఈ మేరకు ఏకంగా చిరంజీవే విజయశాంతికి ఫోన్ చేసి సురేందర్‌రెడ్డికి అపాయింట్‌మెంట్ ఇప్పించాడని టాక్. రాజకీయంగా విభేదాలు ఉన్నా.. ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది అనేది ఈ ఫ్యామిలీస్‌కి దగ్గరగా ఉన్న వారికి మాత్రమే తెలుసు.
సైరాలో విజయశాంతి కనిపిస్తే సినిమాకు మించి వాల్యూ రావడమే కాకుండా తన అభిమానులకు కూడా కమ్ బ్యాక్ ట్రీట్‌లా ఉంటుందని విజయశాంతిని కన్విన్స్ చేసినట్లు తెలిసింది. ఇద్దరి మధ్య ఒక సాంగ్‌ను కూడా రెడీ చేశాడట సురేందర్‌రెడ్డి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంటూ ఎవరికి దొరక్కుండా బిజీగా తిరుగుతున్న దర్శకుడు సురేందర్‌రెడ్డి ఇవన్నీ చక్కబెట్టే పనిలో ఉన్నారు. నవంబర్ చివరి వారం లేదా.. డిసెంబర్ చివరి వారంలో రెగ్యులర్ మొదలు కాబోయే సైరా రిలీజ్ 2019 సంక్రాంతికి ప్లాన్ చేశారు. బిజినెస్ పరంగా బాహుబలి రేంజ్ రికార్డులు దీనితోనే సాధ్యమని మెగా ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. సైరాలో విజయశాంతి అంటున్నారు ఇండస్ర్టీ వర్గాలు.