ఏ పాత్రనైనా సునాయాసంగా పోషించి మెప్పించగల సహజ నటుడు నాని. లవర్ బాయ్ పాత్రలతో దూసుకుపోతున్న నాని ఫ్యూచర్‌లో ఏ తరహా పాత్రలనైనా చేస్తానుగానీ.. హార్రర్ సినిమాలను మాత్రం చేయనే చేయడట. అలాగని హార్రర్ సినిమాలపై నానికి భయమూ లేదు.. అలాగని వ్యతిరేకనూ లేదు. నానికి బాగా నచ్చిన జానర్స్‌లో హార్రర్ ఒకటట. కానీ. ఆ జోనర్‌లో నటించడం మాత్రం తనకు ఇష్టం లేదని చెప్పుకొస్తున్నాడు నాని.
కాగా,
సిద్ధార్థ్ హీరోగా, నిర్మాతగా తెరకెక్కిన గృహం సినిమాకు సంబంధించిన వేడుకలో పాల్గొన్న నాని నువ్వెప్పుడు హార్రర్ సినిమా చేస్తావు అంటూ సిద్ధార్థ్ అడిగిన ఓ ప్రశ్నకు జవాబు ఇస్తూ ఈ విషయం చెప్పాడు. ఈ విషయంలో నాని ఓ లాజిక్ కూడా చెప్పాడు. అదేంటంటే నాకు హార్రర్ సినిమాలు చాలా ఇష్టం. ఈ జానర్‌లో బోలెడన్ని సినిమాలు చూశా.. అయితే నాకు హార్రర్ సినిమాల్లో ఎక్కువగా నచ్చేవి సస్పెన్ థ్రిల్. తరువాత ఏం జరుగుతుందో ఉత్కంఠతతో సినిమా చూడటం నాకెంతో ఇష్టం.
థియేటర్‌లో ఆ భయాన్ని ఆస్వాదిస్తూ సినిమా చూస్తా.. కానీ మనం హార్రర్ సినిమా చూస్తే ఆ థ్రిల్ అంతా పోతుంది. కథేంటో ముందే తెలిసిపోతుంది. భయం అనే భావనే ఉండదు. సెట్‌లో భయపడం, నటీనటులను చూస్తే భయపడం… ఏ ఫీలింగ్ ఉండదు. కాబట్టే నేను హార్రర్ సినిమాలు చేయను. వేరే వాళ్లు చేసిన హార్రర్ సినిమాలతో థ్రిల్ అవడమే నాకిష్టం. అదే లవ్ స్టోరీలకు గాని, ఇంకో జానర్ సినిమాలకు గాని థ్రిల్‌తో పని ఉండదు. ముందే కథ తెలిసినా ఇబ్బంది లేదు. మామూలుగా సినిమా చేసుకుపోతామని నాని చెప్పుకొచ్చాడు.