జాతీయగీతం వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ లేచి నిలబడాలని అంటోంది బాలీవుడ్ నటి సన్నీలియోని. దేశభక్తి అనేది మనసులో ఉప్పొంగే గొప్ప ఉద్వేగమని, అది సహజంగానే బయటపెట్టాలని చెప్పుకొచ్చింది. న్యాయస్థానాల తీర్పుతో నిమిత్తం లేకుండా తమ దేశభక్తిని చాటుకోవాలని తెలిపింది. తాను కూడా అలాగే చేస్తానని పేర్కొంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తేరా ఇంతిజార్’. ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొని సన్నీ సందడి చేసింది.
ప్రజలు దేశభక్తిని రుజువు చేసుకోవడానికి సినిమా థియేటర్లలో జాతీయగీతం ప్రసారమైనప్పుడు లేచి నిలబడాల్సిన అవసరం లేదని ఇటీవల సుప్రీంకోర్టు అభిప్రాయపడిన విషయం విదితమే. ‘దేశభక్తిని నిరూపించుకోవడానికి థియేటర్లలో నిలబడాల్సిన అవసరం లేదన్న సుప్రీంకోర్టు తీర్పును నేను సమర్థిస్తున్నాను. నా విషయానికొస్తే ఎక్కడ జాతీయగీతం వినబడినా, లేచి నిలబడటం నా అలవాటు. అది విన్న వెంటనే నా శరీరం అప్రమత్తమవుతుంది. అంతలా జాతీయగీతం నాలో నాటుకుపోయింద’ని బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ అన్నారు.