Home / MOVIES / ‘అక్క‌డ ర‌క్తం కారుతుంద‌ని.. అబ్బో.. అబ్బో’ అంటూ పూనం ఏం చేసిందో తెలుసా!

‘అక్క‌డ ర‌క్తం కారుతుంద‌ని.. అబ్బో.. అబ్బో’ అంటూ పూనం ఏం చేసిందో తెలుసా!

ప్రజల దృష్టిని తనవైపుకు తిప్పుకోవడం కోసం అందాల ఆరబోతకే కాదు… కాంట్రవర్సీ కామెంట్స్‌కూ తాను తగ్గనంటోంది పూనం పాండే. అప్పుడెప్పుడో ప్రపంచకప్‌ ఫైనల్స్‌ వంకతో ఫోకస్ లోకి వచ్చిన పూనమ్ పాండే… కేవలం గ్లామర్ షోతో ఇన్నాళ్లపాటు లైమ్ లైట్‌లో ఉంటుందని ఎవరూ ఊహించలేదు. అయితే.. ఎప్పటికప్పుడు సరికొత్త భంగిమలలో తన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇప్పటికీ సత్తా చాటుతోంది ఈ సెక్సీ బ్యూటీ. ఇప్పుడు ఈ విషయంలో మరో అడుగు ముందుకేసి ఓ యాప్ కూడా ఓపెన్ చేసేసింది పూనమ్.

పూనమ్ పాండే ఏంచేసినా సరే ఆమె స్టైల్ లోనే ఉంటుంది. సిల్వర్ స్క్రీన్ మీద వెలిగిపోయే అవకాశాలు తెగ రాకపోయినా.. సోషల్ మీడియాను మాత్రం బాగానే వేడెక్కిస్తోంది. ప్రస్తుతం ఈమె చెయ్యక చెయ్యక ఓ సినిమా చేస్తోంది.

ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ స్పాట్ లో ఈమెకు దెబ్బ తగిలిందట. పూనం పాండేకు మోకాలి కింది భాగంలో దెబ్బ త‌గ‌ల‌డంతో స్పాట్‌లోనే ఏడ్చేసింది. అంతేకాదు.. గాయం తీవ్రత ఎక్కువ‌గా ఉండ‌టంతో అబ్బో.. అబ్బో అంటూ.. త‌న గాయాన్ని తానే.. నిమురుతూ.. త‌న‌కు తానే.. ఓదార్చుకోసాగింది. గాయం కార‌ణంగా రక్తం కూడా కారడంతో.. వెంటనే ఆమెకు ప్రథమ చికిత్స చేశారు వైద్యులు. అంతవరకూ బాగానే ఉంది కానీ.. అక్కడితో విషయాన్ని వదిలేసినా.. ఆ మాటను సింపుల్ గా చెప్పినా.. ఆమె పూనమ్ పాండే ఎందుకు అవుతుంది? అందుకే తన గాయానికి వైద్యులు చికిత్స చేస్తున్న దృశ్యాన్ని ఫోటో తీయించుకుని.. దెబ్బ తగిలిందంటూ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తోంది. పైగా ఎంతో లోతుగా తగిలిన గాయాలు.. అతి పెద్ద బహుమతులు అంటూ కొటేషన్స్ కూడా చెప్పేస్తోంది పూనమ్.

దెబ్బ తగలడం.. ట్రీట్మెంట్ చేయడం సంగతేమో కానీ.. అక్కడ కూడా బికినీలో తన కాలి అందాలను తెగ ఆరబోస్తూ.. అబ్బో దెబ్బలు అన్న చందాన బిల్డప్పులు ఇస్తున్న పూనంను జనాలు మాత్రం తెగ నవ్వేసుకుంటున్నారు. సానుభూతి చూపించాలో.. ట్రీట్మెంట్లోనూ బికినీలోనే కనిపిస్తున్న ఈమెను ఏమనాలో తెలీని పరిస్థితి జనాలది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat