సాంప్రదాయక మార్షల్ ఆర్ట్స్‌లో అఖిడో ఓ మాడ్రన్ స్టంట్. ఆత్మరక్షణకు ఈ టెక్నిక్ చాలా ఉపయోగపడుతుంది. అయితే రాహుల్ అఖిడో నేర్చుకుంటున్న ఫోటోలను కాంగ్రెస్ నేత దివ్య స్పందన పోస్ట్ చేసింది. శిక్షకుడు దగ్గర రాహుల్ అఖిడో టెక్నిక్స్ నేర్చుకుంటున్న ఈ ఫోటోలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.
ఇటీవల ఓ కార్యక్రమంలో రాహుల్.. ఒలింపిక్ బాక్సర్ విజేందర్‌తో మాట్లాడారు. అప్పుడు రాహుల్ ఆ బాక్సర్‌కు అఖిడో గురించి చెప్పారు. తాను బ్లాక్ బెల్ట్ అని, దాని గురించి ఎక్కువగా పబ్లిక్‌కు మాట్లాడనన్నారు. ప్రతి రోజూ గంట పాటు అఖిడోను ప్రాక్టీస్ చేస్తానన్నారు. అయితే ఆ అఖిడో వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తే యువతకు ప్రేరణగా ఉంటుందని విజేందర్ కాంగ్రెస్ నేతకు సలహా ఇచ్చారు. ఆ సలహా ప్రకారమే రాహుల్ ఇప్పుడు తన అఖిడో స్టిల్స్‌ను రిలీజ్ చేశారు.