రకుల్ ప్రీత్ సింగ్,.. ఈ బ్యూటీ మొదట తన టాలెంట్‌ను కోలీవుడ్‌లో ట్రై చేసింది. అయితే, అక్కడ వర్కవుట్ కాకపోవడంతో.. తెలుగు ఇండస్ర్టీలో అడుగుపెట్టింది. తరువాత, ఏమంత్రం వేసిందో తెలీదుకానీ.. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు ఈ అమ్మడు మంచి హిట్స్‌నే ఇండస్ర్టీకి అందించిందని చెప్పాలి. అయితే, బడా హీరోలతో సైతం నటిస్తూ..ముందుకు సాగిపోతున్న ఈ సెక్సీ సుందరి తాజాగా తాను నటించిన స్పైడర్ సినిమా సక్సెస్‌తో మాంచి జోష్‌మీద ఉంది. అదే క్రమంలో ఒకానొక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అనేక విషయాలను బయట పెట్టేసింది.
ఇంతకీ ఆమె ఏమంటుందంటే.. సినిమాల్లో అందాల ఆరబోతపై మీ అభిప్రాయం చెప్పమని అడుగగా.. సినిమాల్లో హీరోయిన్లు గ్లామరస్‌గా నటిస్తేనే అభిమానులు చూస్తారని అంటోంది. అంతే కాకుండా… గ్లామర్ దుస్తుల్లోనూ హీరోయిన్లు దేవతల్లా కనిపిస్తారు. అందుకే మాస్ ఫ్యాన్స్ వాళ్లను అలా అభిమానించేది అని అంటోంది. మొత్తంగా అందాల ఆరబోత అసలు తప్పేకాదు అన్నంతగా చెప్పేసింది ఈ బ్యూటీ.. ఇక లిప్‌లాక్స్‌పై మీ ఉద్దేశం ఏమిటి..? అని అడగ్గానే.. దాన్ని ఎందుకు అంతలా బూతులాగా చూస్తున్నారు. అసలు ముద్దు సన్నివేశాల్లో నటించడం తప్పేకాదంటోంది. రివర్స్‌లో కౌంటరిచ్చింది.
అయితే, మళ్లీ కాస్త ఆలోచించి.. కథకు అనుగుణంగా ఏ సీనైనా చేయడానికి నేను రెడీ.. అయితే, ఆ సన్నివేశాలు అశ్లీలంగా ఉండకూడదు. కొందరు ప్రచారాల కోసమే ముద్దు సన్నివేశాలను చిత్రీకరిస్తారు. అలాంటి ముద్దు సన్నివేశాల్లో నటించడం నాకు నచ్చదు. అంటూ తన స్టేట్‌మెంట్‌కి కాస్త టచప్ ఇచ్చింది. అయితే, ఆ మధ్య కొన్ని వదంతులు కూడా వచ్చాయి. కొన్ని చిత్రాలకు కాల్‌షీట్స్ ఇచ్చి.. అందులో నటించకుండా.. దర్శ క నిర్మాతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని అనగానే.. అవన్నీ చీఫ్ ట్రిక్స్ అని, అసలు నేను అలాంటిదాన్ని కాదు అని, నిజానికి నేనెప్పుడు చేయలేదు. అసలు అలా చేయను కూడా అని ఆమె చెప్పకనే చెప్పింద. మొత్తంగా ఇలా ఓపెన్ అయిపోయి అనేక విషయాలను మాట్లాడేసింది రకుల్ ప్రీత్ సింగ్.