తెలుగులో రొటీన్ సినిమాల నుంచి ప్రయోగాత్మక సినిమాల వరకు అన్ని రకాలు ట్రై చేసినా బొమ్మరిల్లు లాంటి సక్సెస్ సిద్ధార్థ్‌కు మళ్లీ దక్కలేదు. కనీసం యావరేజ్‌గా కూడా తన సినిమాలు ఆడకపోవడంతో నెమ్మదిగా సిద్ధార్థ్ తన దృష్టిని కోలీవుడ్ వైపు పెట్టాడు. అక్కడ సినిమాలు చేస్తూ ఇక్కడ డబ్బింగ్ చేస్తున్నాడు. తాజాగా సిద్ధార్థ్ గృహం అనే హర్రర్ చిత్రంలో నటిస్తున్నాడు. తడాఖా సినిమాలో సునీల్‌కు వదినగా కనిపించిన యాండ్రియా జెర్నియా ఇందులో హీరోయిన్గా నటించింది.
అయితే, ఈ సినిమాలో సిద్ధార్థ్ ఆండ్రియాల మధ్య రొమాంటిక్ సీన్లతో ఓ సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో సిద్ధార్థ్ ఆండ్రియాకు గాఢమైన కిస్సు ఇచ్చాడు. అదేదో ఒక్కసారికాదు మూడు నిమిషాలపాటు స్టార్టింగ్ నుంచి ఎండ్ అయ్యేలోపు ఈ జంట అధర చుంభనంలో మునిగి తేలింది. ఈ మధ్య తెలుగులో హిట్టయిన అర్జున్‌రెడ్డి మూవీ తరహాలో లిప్ లాక్‌లతో బాగానే బజ్ క్రియేట్ చేశారు. తొలిసారి జంటగా కనిపిస్తున్న సిద్ధార్థ్ యాండ్రియాల కెమిస్ర్టీ కరెక్ట్‌గా సెట్ కావడం, పాట చిత్రీకరణ, మ్యూజిక్ బాగుండటం, బాలీవుడ్ ఎరోటిక్ సినిమాకు ఏ మాత్రం తీసిపోని విధంగా వీరిద్దరి ఆన్‌స్ర్కీన్ కెమిస్ర్టీ అదరహో అనిపించడంతో ఆ పాట ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది.
సాధారణంగా హార్రర్ జానర్లో తీసిన సినిమాలో ప్రేక్షకులను భయపెట్టాలని చూస్తారు… కానీ ఈ జంట మాత్రం మైమరపిస్తోంది. తెలుగు, తమిళ్ హిందీ భాషల్లో ఒకేసారి గృహం సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. సిద్ధార్థ్, ఆండ్రియా జంటగా రూపొందిన హారర్ చిత్రం ‘గృహం’. మిలింద్ రావ్ దర్శకుడు. సిిద్ధార్థ్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్, ఎటాకి ఎంటర్టైన్మెంట్ బేనర్స్‌పై నిర్మితమైన ఈ సినిమా నవంబర్ 3న విడుదలవుతుంది.
ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతుండగా..తెలుగులో ‘గృహం’, తమిళంలో ‘అవల్’ పేరుతో విడుదల కానుంది. తాజాగా సిద్ధార్థ్ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశాడు. కారు చీకటిలో ఓ భవంతి..ఆ పైన సిద్ధార్థ్, ఆండ్రియా స్టిల్స్..వీరిద్దరి మధ్య ఘోస్ట్‌లా ఉన్న ఓ అమ్మాయి కనిపిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చూస్తూంటే…సిద్ధార్థ్ ఇంట్లో అసలేం జరిగి ఉంటుందో అనే విషయంపై సస్పెన్స్ నెలకొంది. హీరో సిద్ధార్థ్ ‘గృహం’లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే విడుదల వరకు వెయిట్ చేయాల్సిందే.