పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. ఇందులో బాలయ్య సరసన నయనతార కథానాయికగా నటిస్తుండగా.. మరో మల్లుబ్యూటీ నతాషా దోషి ఓ కీలకపాత్ర పోషిస్తోంది. అయితే, కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో యువరత్న బాలయ్య నటిస్తున్న 102వ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్‌ను నవంబర్ 2వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ ఇలా ప్రకటించిందో.. లేదో.. అప్పుడే కొన్ని స్టిల్స్ బయటకు వచ్చేశాయి.
అయినా, ఇలాంటివి మామూలే కదా.. ఏదైనా సినిమా ఫస్ట్‌లుక్, టీజర్ రిలీజ్ చేసే ముందు లీక్ అవడం టాలీవుడ్‌లో సహజమే. కాకపోతే ఇక్కడే ఓ చిన్న తేడా ఉంది. ఈ ఫోటోలను ఎవరో లీక్ చేయలేదు. స్వయంగా చిత్ర బృందమే వర్కింగ్ స్టిల్స్‌ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం వైజాగ్ బీచ్ రోడ్‌లో 5 వేల మంది జూనియర్ ఆర్టిస్టులు 110 బస్సులతో మహాధర్నా సీక్వెన్స్ షూటింగ్ జరుగుతోంది. వాటికి సంబంధించిన వర్కింగ్ ఫోటోలే ఇవి. ఇందులో బాలయ్య మెలేసిన మీసాలతో సరికొత్తగాను, స్టైలిష్‌గాను ఎనర్జిటిక్‌గానూ కనిపించారు.
ఈ చిత్రం ప్రారంభోత్సవం సమయంలో బాలయ్య పైసా వసూల్ లుక్‌తోనే దర్శనం ఇవ్వడంతో..జై సింహాలోనూ అదే లుక్‌ను కంటిన్యూ చేస్తున్నారేమోనని అనిపించింది. కానీ, అందుకు భిన్నంగా ఈ చిత్రంలో గెటప్ మార్చేశారు. టైటిల్‌కి తగ్గట్టుగానే ఆయన సింహగర్జన రూపంలో ఫైట్ చేస్తూ దర్శనమిచ్చారు. ఓవరాల్‌గా చెప్పాలంటే ఆయన లుక్ అరాచకం. ఇక పోతే ఈ వైజాగ్ షెడ్యూల్‌లోనే బాలయ్యపై ఓ మాంటేజ్ సాంగ్‌తోపాటు ఆయనపై, హరిప్రియపై ఓ రొమాంటిక్ పాటను కూడా షూట్ చేయనున్నారు. నయన తార కథానాయకిగా నటిస్తున్న ఈ సినిమా నతాషా దోషి ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇప్పటి వరకు బాలయ్య కెరీర్‌లో సింహ అనే టైటిల్‌తో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయినట్లుగానే జై సింహా కూడా సూపర్ హిట్ అవుతుందని నిర్మాత సి.కల్యాణ్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం సంక్రాంతి కానుకగా.. జనవరి 12న రిలీజ్ కానుంది.