Home / SLIDER / 24గంటల నిరంతర విద్యుత్ కోసం టీ సర్కారు మరో అడుగు ..!

24గంటల నిరంతర విద్యుత్ కోసం టీ సర్కారు మరో అడుగు ..!

24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కరెంట్ ఉత్పత్తిపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా దామరచర్లలో 4 వేల మెగావాట్లతో కూడిన యాదాద్రి ఆల్ట్రా మెగా పవర్ ప్లాంటుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్లాంటును బీహెచ్ఈఎల్ సంస్థ రూ. 20 వేల 370 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో ప్లాంటు నిర్మాణానికి మొదటి విడతగా రూ. 417 కోట్ల 16 లక్షల చెక్కును బీహెచ్ఈఎల్ సీఎండీ అతుల్ సోబ్టికి సీఎం కేసీఆర్ అందజేశారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. దానిని దృష్టిలో పెట్టుకొని విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల నిర్మాణం శరవేగంగా పూర్తి చేయాలని కోరారు. దామరచర్లలో నిర్మించనున్న యాదాద్రి ఆల్ట్రా మెగా పవర్ ప్లాంటు పనులను మూడేళ్లలో పూర్తి చేయాలని కోరారు. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో పారదర్శకత కోసం… జాప్యాన్ని నివారించడం కోసం ప్రభుత్వరంగ సంస్థ అయిన బీహెచ్ఈఎల్ కే పని ఇచ్చామన్నారు.

ప్రభుత్వ నమ్మకాన్ని నిలబెట్టేలా పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కోరారు. యాదాద్రి పవర్ ప్లాంటు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పూర్తి అయ్యిందన్నారు. పర్యావరణ అనుమతులతో పాటు అన్ని రకాల అనుమతులు వచ్చాయని తెలిపారు. కాబట్టి వెనువెంటనే పనులు ప్రారంభించి శరవేగంగా పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

వచ్చే మార్చి నుంచి రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎత్తిపోతల పథకాల నిర్మాణం, కొత్తగా అనేక పరిశ్రమలు కూడా వస్తున్నాయ్నారు. వీటితో పాటు ఇతరత్రా వినియోగం కూడా పెరుగుతున్నందున.. తెలంగాణలో వచ్చే ఏడాదే మరో 3 వేల 500 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ అదనంగా రానుందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల నిర్మాణం చేపట్టామన్నారు సీఎం కేసీఆర్. అన్నింటిలో కెల్లా యాదాద్రి ప్లాంటు చాలా ముఖ్యమైనదని.. 800 మెగావాట్లతో కూడిన 5 యూనిట్ల ప్లాంటులో అన్ని యూనిట్ల నిర్మాణం సమాంతంరంగా ప్రారంభించాలన్నారు. మూడేళ్లలో పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

అటు కొత్తగూడెం, మణుగూరులో కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై కూడా చర్చ జరిగింది. కొత్తగూడెంలో 800 మెగావాట్ల ప్లాంటు నిర్మాణం రెండు మూడు నెల్లలో పూర్తవుతుందని జెన్‌ కో సీఎండీ ప్రభాకర్‌ రావు వివరించారు. వచ్చే ఏడాదికి మణుగూరు ప్లాంటు కూడా పూర్తవుతుందని చెప్పారు. మరోవైపు రైతులకు 24గంటల పాటు విద్యుత్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ఎత్తిపోతల పథకాలు, మిషన్‌ భగీరథ, పరిశ్రమలు, మెట్రో రైలు.. తదితర కార్యక్రమాల కోసం ఏర్పడే డిమాండ్‌ ను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat