తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ వలసలు .అందులో భాగంగా టీటీడీపీ పార్టీ మాజీ నేత ,కోడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి విదితమే .తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఒకరు ప్రస్తుతం అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు అని వార్తలు వస్తోన్నాయి .అందులో భాగంగా ఇటీవల ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమన్వయ కమిటీ సమావేశంలో సదరు మంత్రి చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు ఊతమిస్తున్నాయి .
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఇటీవల ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకోస్తాము అని ఆయన అన్నారు .మాజీ మంత్రి దామోదర్ రెడ్డి యాదృచ్చికంగా అన్నారా లేదా త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరతాను అని ఈ సందర్భంగా సంకేతాలు ఇచ్చారా అనేది కాలమే నిర్ణయించాలి .
అయితే గతంలో తన సోదరుడు రాంరెడ్డి వెంకటరెడ్డి అనారోగ్యపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకంగా కోటి రూపాయలను ఆర్ధిక సహాయం అందించడమే కాకుండా స్థానిక మంత్రి తుమ్మల నేతృత్వంలో ఎమ్మెల్యే వెంకటరెడ్డిపై చూపిన శ్రద్ధ కూడా ప్రస్తుతం దామోదర్ రెడ్డిను టీఆర్ఎస్ పార్టీలోకి ఆకర్షించింది .అందుకే ఇలా మాట్లాడారు అని కూడా రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి .