నలుగురు సౌత్ ఇండియన్ క్వీన్స్ ఒక్కచోట చేరారు. ఇంకేముంటుంది సరదా సరదాగా గడుపుతున్నారు. ఇంతకు వారెవరు. ఎక్కడ చేరారు.. ఎందుకు చేరారు.. అంటారా..? వీరు నలుగురు వారి వారి భాషట్లో క్వీన్ సినిమాల్లో నటిస్తున్నారు. తమన్నా తమిళంలో, కాజల్ తెలుగులో, మంజిమా మోహన్ మళయాళంలో, పరుల్ యాదవ్ కన్నడలో తెరకెక్కిస్తున్న క్వీన్ సినిమాలో నటిస్తున్నారు. అయితే, ఈ సినిమా షూటింగ్ ఫ్రాన్స్‌లో జరుగుతోంది. అంతేకాదు, నాలుగు భాషల్లో తెరకెక్కుతున్న సినిమాలు ఒకే లొకేషన్‌లో జరుగుతున్నాయి.
వీరంతా ఒకే హోటల్‌లో బస చేస్తున్నారు. దీంతో సరదా సరదాగా గడుపుతూ షూటింగ్‌కి కూడా కలిసి వెళ్తూ వస్తున్నారట. నలుగురు హీరోయిన్స్ షూటింగ్ ఒకేచోట ఉండటం అరుదుగా జరుగుతుంది. మామూలుగా ఒక్క హీరోయిన్ ఉంటేనే లోకల్ మీడియాకి పెద్ద న్యూస్. అలాంటి నలుగురు హీరోయిన్స్ ఉన్నారని తెలిసి.
వారి కోసం ఎదురు చూసిన మీడియాకు నలుగురు కలిసి ఒకే చోట దొరకడంతో ఫ్యాన్స్, ప్రెస్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అసలు ఈ విషయం వినగానే. తమన్నా చాలా ఎగ్జయిట్ యిందట. కాజల్‌కి చాలా క్లోజ్ ఫ్రెండ్స్‌లో తమన్నా ఒకరట. ఇంతకు ముందు ఫిల్మ్ ఈవెంట్స్ కలిసి జరుపుకునే వాళ్లం. కానీ ఫిల్మ్ సెట్స్, షూటింగ్స్ ఒకే లొకేషన్‌లో జరుపుకోవడం చాలా విచిత్రంగా ఉందని కాజల్ తెలిపారు.