గుండెల్లో గోదావరి, మలుపు, సరైనోడు, నిన్నుకోరి వంటి చిత్రాలతో విభిన్నమైన పాత్రలతో మెప్పించిన యువ కథానాయకుడు ఆది పినిశెట్టి ప్రస్తుతం రంగస్థలం మూవీతోపాటు, పవన్, త్రివిక్రమ్ మూవీలోనూ నటిస్తున్నాడు. తాజాగా మీడియాతో ముట్టిడించిన ఆది పవన్ కల్యాణ్ గురించి చాలా గొప్పగా చెప్పి పవన్ అభిమానులను ఆకట్టుకున్నాడు.
పవన్ కల్యాణ్ గారు చాలా సింపుల్‌గా ఉండే వ్యక్తి, తాను స్టార్ హీరోనన్న హోదాను ఏ మాత్రం చూపించుకోరు. పవన్ కల్యాణ్ దగ్గరి నుంచి చాలా నేర్చుకోవాలి. ప్రస్తుతం ఆయన సినిమాలో చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. విక్రమ్ గారు క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు చాలా ఆనందంగా ఫీలయ్యారు. ఆ క్యారెక్టర్ చాలా వరకు నాకు ప్లస్ అవడం ఖాయమని తెలిపాడు.
ఇక చరణ్ రంగస్థలం గురించి చెప్పాలంటే స్పెషల్ రోల్ చేస్తున్నాను. సుకుమార్ సినిమాను చాలా బాగా తెరకెక్కిస్తున్నాడు. చరణ్‌తో కెమిస్ర్టీ చాలా బాగా సెట్ అయిందని చెప్పాలి. ఆయన నాకు ఫ్రెండ్ కూడా అయ్యాడు. ఇండస్ర్టీలో నాని, మనోజ్ కూడా తనకు మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చాడు ఆది పినిశెట్టి.