తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఇవాళ సిద్ధిపేట జిల్లాలో విరామం లేకుండా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే . సిద్దిపేట మినీస్టేడియంలో తెలంగాణ గోల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఆయన వెంట ఎంపీ బీబీ పాటిల్ ఉన్నారు.ఉదయం సిద్దిపేటలోని పలు కాలనీల్లో పర్యటించిన మంత్రి స్థానికంగా ఉన్న ప్రజలను పలకరించి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సిద్దిపేట కోమటి చెరువును సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. జిల్లాలోని చిన్నకోడూర్ లో 5000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఉన్న వ్యవసాయ మార్కెట్ గోదాంను ఆయన ప్రారంభించారు. జిల్లాలోని చిన్నకోడూర్‌లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అదనపు తరగతి గదులను మంత్రి ప్రారంభించారు. మంత్రి వెంట వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, కాకతీయ అర్భన్ డెవలప్‌మెంట్(కుడ) చైర్మన్ మర్రి యాదవరెడ్డి, వరంగల్‌కు చెందిన టీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.
Attended inaugural ceremony of Telangana cricket gold cup -2017 at siddipet Mini Stadium. pic.twitter.com/eYRyyAwzHc
— Harish Rao Thanneeru (@trsharish) November 4, 2017
Inaugurated 5000 metric tonnes capacity Agriculture market Godown at chinnakodur, Siddipet Dist #Telangana pic.twitter.com/efavrIb5L9
— Harish Rao Thanneeru (@trsharish) November 4, 2017
Inaugurated additional class rooms at Government junior college, ChinnaKodur, Siddipet Dist. pic.twitter.com/b7KrcjkmL4
— Harish Rao Thanneeru (@trsharish) November 4, 2017
Surprise visit to #siddipet Komati Cheruvu Mini Tank Bund Beautification Works. pic.twitter.com/VxFZ8Vnr9F
— Harish Rao Thanneeru (@trsharish) November 4, 2017