అప్పటి సమైక్య రాష్ట్రంలో ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే ఉమ్మడి ఏపీ రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన మాట రాష్ట్రం విడిపోతే తెలంగాణ ప్రజలు చీకట్లో బ్రతకాల్సి వస్తుంది .కరెంటు లేక తెలంగాణ రాష్ట్రం చీకట్లో ఉంటుంది అని ఎద్దేవా చేశారు .రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు ఏడాదిలోనే రెప్పపాటు పోనీ కరెంటును అందించింది .
తాజాగా ఈ రోజు రాత్రి నుండి వ్యవసాయరంగానికి ఇరవై నాలుగు గంటల కరెంటును ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది .ఈ క్రమంలో భవిష్యత్తులో కరెంటు లోటు ఇక మనం మరిచిపోవాల్సిందే. ఇక అంతా విద్యుత్తు రాజ్యమే. ఇవాళ్టి అర్థరాత్రి నుంచి రైతన్నలకు నిరంతర విద్యుత్తును సరఫరా చేయనున్నారు.
అన్నదాతలకు ఇక పవర్ కష్టాలు తీరినట్లే. ప్రయోగాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా అయిదారు రోజుల పాటు పొలాలకు అంతరాయంలేని వ్యవసాయరంగానికి ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటు అందించనున్నారు.దీనిపై మంత్రి కేటీఆర్ తన సోషల్ మీడియాలో ట్విట్టర్ లో ఇది నిజంగా రాష్ట్ర రైతులకు సాధికారత ఇవ్వడమే. అన్నదాతల అభ్యున్నతికి ఇది మరో నాంది. ప్రగతి కాంక్షిస్తున్న రాష్ర్టానికి ఈ ప్రయత్నం మరో మణిహారం. కరెంటు లోటు ఉన్న రాష్ట్రంగా పుట్టిన తెలంగాణ ఇప్పుడు అనూహ్య రీతిలో రూపాంతరం చెందింది. ఇది ప్రతిపక్షాలకు కరెంట్ షాక్ లాంటి వార్తే. సాగు చేసే రైతన్నకు మాత్రం ఇదో అద్భుత ఘట్టం. నిరంతరాయ విద్యుత్తు ఇచ్చే రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించడం అద్భుత పరిణామం . బ్రేక్‌లేని కరెంటుతో రైతులు బలోపేతమవుతారని ట్వీట్ చేశారు .
Em’Power’ing the farmers of Telangana; a state that began its journey as a power deficit state. What a fabulous turnaround ??? https://t.co/h94nYThzGi
— KTR (@KTRTRS) November 6, 2017