చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాని తెలుగు జాతి గర్వించదగ్గ వీరుడు, స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథని ఆధారంగా చేసుకుని.. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సుమారు రూ. 200 కోట్లతో తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. కాగా, డిసెంబర్ నెల నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
మెగాస్టార్ చిరంజీవి తన కమ్‌బ్యాక్ చిత్రం ఖైదీ నెం.150తో బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం తన 150వ చిత్రంగా సైరా నరసింహారెడ్డిగా రెడీ అవుతున్నారు. కాగా, ఈ సినిమా తరువాత మెగాస్టార్ ఓ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్‌లో నటించనున్నారు. అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు చిత్ర యూనిట్.
ఇక తాజాగా టాలీవుడ్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. పవన్ కల్యాణ్‌తో మల్టీ స్టారర్ సినిమాను డైరెక్ట్ చేయనున్న త్రివిక్రమ్ పని తనానికి ఇంప్రెస్ అయిన చిరు తనతో ఓ చిత్రం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడీ వార్త ఇండస్ర్టీలో హాట్ టాపిక్‌గా మారింది. త్రివిక్రమ్.. చిత్రాలను డైరెక్ట్ చేసే విధానం, అతను సినిమాలపట్ల చూపించే ఆసక్తిగాని, హీరోలను హ్యాండిల్ చేసే విధానం.
ఇలా అన్ని విధాలుగా చిరుకి త్రివిక్రమ్ బాగా నచ్చడంతో అతడితో ఓ సినిమా చేసేందుకు సై అన్నాడట. ఇక ఈ సినిమా కోసం త్రివిక్రమ్ చిరుకి ఓ స్టోరీ లైన్ సైతం వినిపించారట. ఇది మెగాస్టార్ నటించిన రాక్షసుడు తరహా స్ర్కిప్ట్ అని తెలుస్తోంది.ఒకవేళ ఈ వార్త నిజమైతే మనం త్వరలోనే చిరంజీవి విశ్వరూపం చూసేందుకు వీలుంటుంది. ఏదేమైనా చిరు – త్రివిక్రమ్ కాంబో అనగానే ఇండస్ర్టీ మొత్తం అలర్ట్ కావడం నిజంగానే విశేషం.