ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్నటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేరకు పాదయాత్ర నిర్వహించడానికి సిద్ధమైన సంగతి తెల్సిందే .అందులో భాగంగా నిన్న వైఎస్సార్ కడప జిల్లాలో ఇడుపుల పాయలో వైఎస్ ఘాటు నుండి మొదలెట్టిన పాదయాత్ర తొలిరోజు తొమ్మిది కిలోమీటర్లు దూరం నడిచారు .
జగన్ పాదయాత్రపై టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు .నిన్న సోమవారం రాష్ట్ర సచివాలయంలో బాబు అధ్యక్షతన అసెంబ్లీ వ్యూహ రచన కమిటీ సమావేశం జరిగింది .ఈ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ నిద్రలో కూడా సీఎం సీటు గురించే కలవరిస్తుంటారు .ఆయన ద్యాస అంత దానిపైనే ..తను సీఎం కావాలని కోరుతూ ప్రార్ధనలు చేయాలనీ ప్రజలకు పిలుపునిచ్చిన నాయకుడు ఇయన ఒక్కడే .
పాదయాత్ర గురించి ఎవరు మాట్లాడొద్దు అని తమ పార్టీ నేతలకు బాబు సూచించాడు .బాబు వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు స్పందిస్తూ జగన్ పాదయాత్ర తొలిరోజే బాబు గుండెల్లో రైళ్ళు పరుగెత్తించాయి .జగన్ పాదయాత్రను చూసి బాబు టీడీపీ శ్రేణులు భయపడుతున్నారు .మరి నేను వేసిన రోడ్లపై నడుస్తూ ..నేను ఇచ్చే పించన్లు తీసుకుంటూ ..తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అనుభవిస్తున్న వారు తమకే ఓట్లు వేయాలని ప్రజలను బెదిరించిన మొట్ట మొదటి నాయకుడు చంద్రబాబే అని విమర్శల పర్వం కురిపించారు .