Home / MOVIES / హ‌వ్వా..! శ్రీ‌ముఖి.. కేవ‌లం రూ.20లేన‌ట‌!

హ‌వ్వా..! శ్రీ‌ముఖి.. కేవ‌లం రూ.20లేన‌ట‌!

శ్రీముఖి ఇప్పుడు బుల్లితెర యాంక‌రే కాదు.. హాట్‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. త‌న‌దైన న‌ట‌న‌తో ఓ వైపు బుల్లితెర‌పై యాంక‌రింగ్ చేస్తూ.. మ‌రో వైపు వెండితెర‌ను వేడిక్కిస్తున్న యాంక‌ర్ల‌లో శ్రీ‌ముఖి ఒక‌రు. ఎలాంటి రొమాంటిక్ సీన్స్‌నైనా.. అది బుల్లితెర‌నా..? వెండి తెర‌నా..? అనే తేడా లేకుండా.. త‌న హాట్ ఎక్స్ ప్రెష‌న్స్‌తో పండించ‌గ‌ల స‌త్తా శ్రీ‌ముఖి సొంతం.

అయితే, అంత‌కు ముందు నిమాల్లో హీరోయిన్‌గా రాణించాలని తెగ ట్రై చేసింద‌ట శ్రీ‌ముఖి. కానీ పదో తరగతి పూర్తయ్యే సరికే ఆమె వంద కిలోల బరువు ఉండ‌టంతో అది కుద‌ర‌లేదు. మామయ్యా పెళ్లికోసమని డైటింగ్‌ చేసి మరీ 8 నెలల్లోనే 40 కిలోల బరువు తగ్గిందట. శ్రీముఖికి చిన్నప్పుడు బలపాలు తినే అలవాటు ఉండేద‌ని ఓ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో భాగంగా శ్రీ‌ముఖి వాళ్ల అమ్మే స్వ‌యంగా చెప్పారు కూడాను. శ్రీ‌ముఖి త‌న అమ్మమ్మ వాళ్లింటికి వెళ్తే.. బలపాలు దొరికేవి కావనీ.. దాంతో మట్టి గోడల్ని గిల్లుకొని తినేదని శ్రీ‌ముఖి గురించి చెప్పుకొచ్చారు.

అటువంటి శ్రీ‌ముఖి నేడు, ఇటు బుల్లితెర‌పై, అటు వెండితెరపై రొమాన్స్‌ను ఓ రేంజ్‌లో పండించేస్తోంది. టాప్ హీరోయిన్స్ ఎవ్వరికీ తగ్గని రేంజ్‌లో తన రొమాంటిక్ యాంగిల్‌ని మ‌ళ్లీ మ‌ళ్లీ చూపిస్తోంది యాంకర్ శ్రీముఖి. దీంతో శ్రీ‌ముఖి రేంజ్ వెండితెర స్టార్ హీరోయిన్‌లతో స‌మానంగా నిల‌బ‌డుతోంది. అంతేకాదు, అందం, యాటిట్యూడ్, చలాకీతనాని..త న హాట్‌ సెక్స్ అప్పీల్ శ్రీ‌ముఖి సొతం.

అయితే, ఈ మ‌ధ్యన‌ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో శ్రీ‌ముఖితోపాటు బిత్తిరి స‌త్తి పాల్గొన్నారు. ఇంకేముందీ.. బిత్తిరి స‌త్తి త‌న టైమింగ్ పంచ్‌ల‌తో శ్రీ‌ముఖిని ఓ రేంజ్‌లో ఆడేసుకున్నాడు. ఈ సంద‌ర్భంలోనే మ‌న‌మిద్ద‌రం సినిమా చేద్దామా? అని బిత్తిరి స‌త్తి అడ‌గ్గానే.. వెంట‌నే స్పందించిన శ్రీ‌ముఖి.. ఇప్పుడే సైన్ చేస్తా అగ్రిమెంట్ పేప‌ర్స్ ఉంటే అంటూ బ‌దులిచ్చింది. పైస‌లొద్దా? ఎంతిస్తావ్ అని అడ‌క్కుండానే సైన్ చేస్తావా? ఎవ్వ‌ర‌డిగినా.. ఇలానే స్పందిస్తావా? అంటూ బిత్తిరి త‌న పంచ్ డైలాగ్‌తో కామెడీ పండించాడు. దీంతో వెంట‌నే తేరుకున్న శ్రీ‌ముఖి.. ఎంతిస్తావో నువ్వే చెప్పు అంటూ బిత్తిరి స‌త్తివైపు ఓ హాట్ లుక్ ఇచ్చింది. ఎంతోకొంత తీసుకుని నాతో సినామా మాత్రం చెయ్‌.. అన్న బిత్తిరి స‌త్తి మాట‌కు.. క‌నీసం 20 రూపాయ‌ల‌న్నా ఇస్తావా? అంటూ శ్రీ‌ముఖి బ‌దులిచ్చింది.

సినిమా షూటింగ్‌కు మ‌రీ 20 రూపాయ‌లు అడిగేంత పిచ్చిదేం కాద‌ని, ఆమె అడిగింది 20 రూపాయ‌లే అయినా.. సినిమావాళ్ల భాష‌లో 20 ల‌క్ష‌లై ఉంటుంద‌ని అంటున్నారు ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు.అందులోనూ మీడియాలో లైవ్ ఇంట‌ర్వ్యూ కాబ‌ట్టి.. తాను తీసుకునే రెమ్యున‌రేష‌న్‌ను బ‌య‌ట‌కు తెలీకుండా బాగానే జాగ్రత్త ప‌డింది శ్రీముఖి.. మ‌రీ శ్రీ‌ముఖినా.. మ‌జాకా!

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat