ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి విదితమే .ఆ తర్వాత కొన్నాళ్ళకు ఎమ్మెల్యే నాగిరెడ్డి అకాలమరణం పొందటంతో ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే .
ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున పోటి చేసిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డిపై అధికార టీడీపీ పార్టీ అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి దాదాపు ఇరవై ఏడు వేల ఓట్లకుపైగా మెజారిటీతో గెలుపొందారు .అయితే అప్పట్లో టీడీపీ పార్టీ ఉప ఎన్నికల్లో గెలవడానికి రెండు వందల కోట్లు ఖర్చు చేసింది అని వార్తలు కూడా వచ్చాయి .
దీని గురించి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విఎన్ పల్లి లో జరుగుతున్న ప్రజాసంకల్ప యాత్రలో స్పందించారు .ఆయన మాట్లాడుతూ “నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ పార్టీ దాదాపు రెండు వందల కోట్ల రూపాయలను పంచింది .ఓటుకు ఆరు వేల నుండి పది వేల రూపాయలను పంచి గెలిచారు .వాపు చూసుకొని బాబు బలుపు అనుకుంటున్నారు .దమ్ముంటే పార్టీ మారిన ఇరవై ఒక్కమంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మరల గెలవాలని ఆయన సవాలు విసిరారు .