ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర పై ఆ రాష్ట్ర మంత్రి జవహర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పాదయాత్ర చేస్తోన్న జగన్ ఎక్కడ ముద్దులు పెడతారోనని జనం భయపడి పారిపోతున్నారని ఆయన సెటైర్ వేశారు.
అధికారం కోసమే జగన్ పాదయాత్ర చేస్తున్నారని, ఆ యాత్ర ముగిసే సరికి వైసీపీ ఖాళీ కావడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్యారడైజ్ పేపర్లలో తన పేరు లేదని జగన్ బుకాయిస్తున్నారని, తన అక్రమాస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎందుకు జప్తు చేసిందో చెప్పాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.