తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావలసిన అవసరం ఉంది అని ..మందకృష్ణ మాదిగకు చిత్తశుద్ధి ఉంటె కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలి ..దానికి మేము సహకరిస్తాము అని రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు .ఆయన హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు తమ టీఆర్ఎస్ సర్కారు కట్టుబడి ఉంది.
అందుకే ఇప్పటికే అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది అని ఆయన అన్నారు .ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ,డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ద్వారా వినతి పత్రం అందజేశారని ఈ సందర్భంగా పిడమర్తి రవి గుర్తు చేశారు .ఎస్సీ వర్గీకరణ దేశ సమస్యగా చూడవద్దు అని ..దీని ద్వారా ఎస్సీ వర్గీకరణకు జరగదు .
ఉత్తరాది రాష్ట్రాలు వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నాయి అని ఈ సందర్భంగా ఆయన అన్నారు .ఉద్యమం తెల్సిన నేత కాబట్టి భారతి మరణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాలుగా అండగా ఉంటామని ఇరవై ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా అందించారు అని అన్నారు .