ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ రేపటి నుండి జరగనున్న శాసనసభ సమావేశాల్లో పాల్గొనకూడదు అని నిర్ణయించుకున్న సంగతి విదితమే .గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన ఇరవై ఒక్కమంది ఎమ్మెల్యేలపై ఫిరాయింపు చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని గత కొంతకాలంగా వైసీపీ పార్టీ పోరాడుతున్న సంగతి కూడా తెల్సిందే .
అయితే ఎంత పోరాడిన ..ఎన్ని సార్లు స్పీకర్ చుట్టూ తిరిగిన కానీ ఫలితం లేకపోవడం వలన వైసీపీ ఈ నిర్ణయం తీసుకున్నది .ఈ నిర్ణయం పై ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పందించారు .గఅయితే ప్రజలు తమ సమస్యలను విన్పించడానికి తమ కోసం పని చేయడానికి వాళ్ళను గెలిపించారు .ప్రతిపక్ష పార్టీ లేకపోయిన సభ జరుగుతుంది .
వాళ్ళు వస్తే బాగుంటది అని ఆయన కోరారు .అయితే ఫిరాయింపు చట్టం ప్రకారం చర్యలు తీసుకోకుండా ప్రధాన ప్రతిపక్షాన్ని సభకు రావాలని కోరడం వింతంగా ఉంది .