తమకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకునేందుకు దేనికైనా వెనుకాడరు నటీనటులు. అయితే, ఓ సారి స్టార్ ఇమేజ్ అనుభవించి.. సినిమాల ప్లాప్‌ల వల్ల స్టార్ డమ్ డౌన్ అయిన సందర్భంలో నటీనటుల తంటాలు అంతా ఇంతా కాదు. ఎలాగైనా వారి అభిమానులను దూరం చేసుకోకూడదు అనే కాన్సెప్ట్‌తో అటు సోషల్ మీడియా ద్వారానూ, ఇటు చిన్న చిన్న కార్యక్రమాల ద్వారానూ అభిమానులకు దగ్గరవుతుంటారు. అంతేకాదు.. సంచనాలు కలిగించే విషయాలపై స్పందించేందుకు ముందుంటారు కూడాను. అలా మాట్లాడి సంచలన విషయాలకన్న వీరి మాటలే హైలెట్‌గా ఉండేలా వారి టాకింగ్ ఉంటుంది. చెప్పుకోవాలంటే.. ఈ జాబితాలో చాలామందే నటీనటులు ఉన్నారు.
తాజాగా ఇటువంటి పద్ధతినే అనుసరించింది తనీషా ముఖర్జీ. ఇంతకీ తనీషా ముఖర్జీ ఎవరనేగా మీ డౌట్. తనీషా ముఖర్జీ ఎవరో కాదండి బాలీవుడ్ తార కాజోల్ స్వాయాన సోదరి. ఒకానొక సమయంలో కాజోల్ తన ముద్దుల చెల్లులు తనీషా ముఖర్జీ నటించిన ’ద జ్యూరీ’ గురించి మాట్లాడుతూ.. ‘‘నేను నిజంగా ఉద్వేగానికి గురవుతున్నా. తనీషా నటించిన మొదటి నాటకాన్ని చూశాను. అందులో చాలా బాగా చేసింది. ఆమె రంగస్థల కెరీర్ ఫెంటాస్టిక్‌గా సాగుతుందని ఆశిస్తున్నా అంటూ కితాబిచ్చింది కూడాను.
ఈమె కాజోల్ చెల్లిగానే కాకుండా.. హాట్ భామల జాబితాలో కూడా ఈమె పేరుంటుంది. అందుకు కారణంగా ఈమె బికినీ అందాలే. అంతేకాదు.. బాలీవుడ్ సెక్సీ నటిగా ఈమెకు పేరుంది. గతంలో ఎన్టీఆర్ హీరోగా కంత్రి సినిమాలో సెకండ్ హీరోయిన్‌గాను, తమిళ చిత్రం నీ వల్లే నీ వల్లే అనే పేరుతో తెలుగులోకి డబ్ అయిన చిత్రంలోనూ నటించింది ఈ సెక్సీ భామ.
అయితే, తాజాగా తనీషా ముఖర్జీ మరో సారి వార్తల్లో నిలిచింది. స్మార్ట్ ఫోన్‌ల పుణ్యమా అంటూ ముద్దులతో రెచ్చిపోయింది ఈ సెక్సీ భామ. ఫేస్‌బుక్ లైవ్‌లో అభిమానులతో మాట్లాడుతున్న క్రమంలో.. అభిమానులకు ఫ్లయింగ్ కిస్సులు పెడుతూ అలరించింది. దీంతో కాజోల్‌లాగానే.. తనీషా ముఖర్జీ కూడా టాప్ హీరోయిన్ అవుతుందని కామెంట్లు పెడుతున్నారు సెక్సీభామ అభిమానులు. మరి ఫేస్‌బుక్‌లో ఫ్లయింగ్ కిస్సులు ఇస్తున్న ఈ భామ.. ఫ్లయింగ్ కిస్సులతోనే ఆపుతుందో.. లేదో మరి.