సినీ సెలబ్రిటీలు రాజకీయాల గురించి స్పందించడం చాలా అరుదు. ఎక్కడా లేని తంటాలు వచ్చిపడతాయోనన్న భయంతో సాధ్యమైనంత వరకు రాజకీయాల్లో వేలుపెట్టరు. కానీ, ఈ మధ్య రాజకీయాలంలో కాస్త ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా పవన్ జనసేన పార్టీ పెట్టినప్పట్నుంచి తారల హంగామా మొదలైంది. మొదట్లో పెద్దగా నోరు విప్పలేదు. కానీ, ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఒక్కొక్కరుగా మీడియా ముందు వారి.. వారి భిన్నాభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
తాజాగా సీనియర్ నటుడు నరేష్ సంచలన ట్వీట్ చేశాడు. లక్షలాది మంది ఫ్యాన్స్, జనాలు పవన్ కల్యాన్, కమల్ హాసన్ సీఎం కావాలని కోరుకుంటున్నారు. ఒకవేళ వారు సీఎంలు అయితే, సీనియర్ ఎన్టీఆర్, ఎంజీఆర్‌ల గోల్డెన్ పీరియడ్ మళ్లీ తిరిగొచ్చినట్లే. అని నరేష్ ట్వీట్ చేశారు. అంటే.. పవన్‌ని తాను ముఖ్యమంత్రిగా చూడాలని ఉందని చెప్పకనే చెప్పేశారు నరేష్. అయితే, నరేష్ చేసిన ట్వీట్ పవన్ ఫ్యాన్స్‌ని సంతోష పెట్టినా.. రాజకీయవర్గాల్లో మాత్రం మంట రేపుతోంది. కొన్ని రోజుల వరకు బీజేపీ జనరల్ సెక్రటరీగా పనిచేసిన ఆయన ఇలా పవన్‌ను సపోర్ట్ చేసి మాట్లాడటం పెను దుమారం రేపుతోంది.