ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఆరు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి విదితమే .పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కడప జిల్లాలో పాదయాత్రను నిర్వహిస్తున్నారు .జగన్ పాదయాత్రకు యువత ,నిరుద్యోగ యువత ,మహిళలు ,వృద్ధులు ,విద్యార్ధిని విద్యార్ధుల నుండి అశేష ఆదరణ లభిస్తుంది .
దారి పొడవున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు .ఆరో రోజు పాదయాత్రలో భాగంగా జగన్ జిల్లాలో ప్రొద్దుటూరు నియోజక వర్గంలో కొనసాగుతుంది .ఈ పాదయాత్రలో ఒక చిన్నపాపను జగన్ వద్దకు తీసుకొచ్చారు .
ఆ పాపకు కాళ్ళకు గాయం అవడంతో కట్లు కట్టారు .దీంతో ఆ సందర్భంలో ఆ పాపను చూడగానే జగన్ కళ్ళు చెమర్చాయి .దీంతో ఆ పాపను దగ్గరకు తీసుకొని ఆప్యాయతను ,అనురాగాన్ని పంచి ..ఆ పాప ఆరోగ్యం కుదుట పడేవరకు సరైన చికిత్స అందించాలని ..అందుకు అండగా ఉండాలని జగన్ స్థానిక పార్టీ నాయకత్వాన్ని ఆదేశించారు .