ఏపీలో టీడీపీ నేతల రౌడీయిజం రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. తాజాగా చిలకలూరిపేటకు చెందిన మధ్యం వ్యాపారి ఊటుకూరి శ్రీనివాసరావు రాసిన సూసైడ్ నోట్ సంచలనం రేపుతోంది. ఒక మద్యం షాపు విషయమై అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి.. ఆయన పీఏ సారధి నన్ను బెదిరిస్తున్నారని.. వాళ్ళు నన్ను బతకనివ్వరిన.. నేను ఆత్మ హత్య చేసుకుని వెళ్ళిపోతా అంటూ ఒక సూసైడ్ నోటు రాసి ఇంటిలో నుండి వెళ్ళిపోయారు.
ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం ముక్తేశ్వరానికి చెందిన ఊటుకూరి శ్రీనివాసరావు మొదటి నుండి మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం వర్గీయుడిగా ఉన్నాడు. ఈ ఏడాది బల్లికురవ మండలం కొమ్మాలపాడులో శ్రీనివాసరావు మద్యం దుకాణం ఏర్పాటు చేశాడు. గొట్టిపాటి తన వర్గానికి చెందిన నాగేశ్వరరావుతో ఆ పక్కనే మద్యం దుకాణం ఏర్పాటు చేయించారు. అయితే శ్రీనివాసరావును తన వర్గంలో చేరాలని.. లేదంటే మద్యం దుకాణం మూసేసి వెళ్లిపోవాలంటూ గొట్టిపాటి, ఆయన పీఏ సారథి, మరికొందరు నిత్యం బెదిరింపులకు దిగుతూ మానసికంగా వేధించారట.
అయినా మాట వినకపోవడంతో గొట్టిపాటి రవి తన అధికార బలం ఉపయోగించి శ్రీనివాసరావు మద్యం దుకాణాన్ని మూసివేయించారట. దీంతో తీవ్ర మనస్తాపానికి గురి అయిన శ్రీనివాసరావు వారం కిందట తొమ్మిది పేజీల సూసైడ్ నోట్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడని శ్రీనివాసరావు సోదరుడు వెంకట సుబ్బారావు తెలిపారు. దీంతో తన సోదరుడు శ్రీనివాసరావు అదృశ్యంపై ఈ నెల 16న చిలకలూరిపేట టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. గొట్టిపాటి, పీఏ సారథి, మద్యం వ్యాపారి నాగేశ్వరరావు బెదిరింపుల వాయిస్ రికార్డులను అందించినప్పటికీ వారి పై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. వారి పై కేసు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాసరావుది కేవలం మిస్సింగ్ కేసుగా నమోదు చేశారని సుబ్బారావు చెప్పారు.