శృతి హాసన్. దక్షణాది చిత్ర పరిశ్రమతోపాటు బాలీవుడ్ సినీ జనాలకు ఈ పేరు సుపరిచితమే. కమల్‌హాసన్ కూతురుగా సినిమాల్లోకి వచ్చినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది శృతి హాసన్. అయితే, సినీ ఇండస్ర్టీకి పరిచయమైన కొత్తల్లో నటించిన చిత్రాలు వరుసపెట్టి మరీ అట్టఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకన్నాయి. దీంతో శృతి హాసన్‌పై అటు బాలీవుడ్‌లోను, ఇటు సౌత్ సినీ ఇండస్ర్టీలోనూ శృతిహాసన్‌పై ఐరెన్ లెగ్ అనే ముద్ర పడింది. దీంతో ఈ భామకు ఒకానొక కాలంలో అవకాశాలు తగ్గిన మాట వాస్తవం.
పవన్ కల్యాణ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు హరీశ్ కాంబోలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ చిత్రంలో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకోవడంతోపాటు .. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో శృతిహాసన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
ఇటీవల ఈ హాట్ బ్యూట్ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అమ్మడు మాట్లాడుతూ.. తనకు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడమంటే చాలా ఇష్టమని.. ఎక్కువ సమయం అందుకే కేటాయిస్తానని చెప్పుకొచ్చింది. నేను ఇప్పటి వరకులా చాలా మంది స్టార్ హీరోలతో నటించాను. కాబట్టి నాకు అన్ని విషయాలు తెలుసు అనుకుంటే పొరపాటేనంటూ చెప్పుకొచ్చింది. నాకు కూడా తెలియని విషయాలు చాలానే ఉంటాయి. వాటి గురించి ఎవరైనా చెబితే విని నేర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటాను అని తెలిపింది. అందరిలాగానే నేను కూడా.. నేనేమీ పై నుంచి దిగి రాలేదు కదా అంటూ తన ఇంటర్వ్యూను ముగించింది శృతిహాసన్.