ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ర్టీలో మెగాస్టార్ చిరంజీవి బాడీ లాంగ్వేజ్, అచ్చు చిరు డ్యాన్స్‌ను యాజ్‌టీజ్‌గా దించేయగల హీరోలలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. సాయి ధరమ్‌తేజ్‌ను సినీ ఇండస్ర్టీకి పరిచయం చేసింది పవన్ కల్యాణే అయినా.. సాయి ధరమ్ తేజ్ నటన మెగాస్టార్ చిరంజీవిని గుర్తు చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. అయితే, సాయి ధరమ్‌తేజ్ మెగా కుటుంబం నుంచి వచ్చినప్పటికీ సినీ ఇండస్ర్టీలో మాత్రం అందరివాడుగా గుర్తింపు పొందాడు. దీనికి కారణం, ఇతర హీరోల ప్రోగ్రామ్స్‌కు అటెంట్ అవడం, తన సినిమా ప్రోగ్రామ్స్‌కు ఇతర హీరోలను పిలవడం, ఇలా తను కేవలం మెగా మేనల్లుడినే కాదని, అందరి వాడినంటూ చాటిచెబుతున్నాడు సాయి ధరమ్‌తేజ్.
అయితే, తాజాగా సాయిధరమ్ తేజ్ నటించిన చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అదేమిటంటే..!
తిక్క, విన్నర్ వంటి చిత్రాలతో వరుస అపజయాలను మూటగట్టుకున్న సాయిధరమ్‌తేజ్‌కు జవాన్ సినిమా థియేట్రికల్ ట్రైలర్ నిరాశనే మిగిల్చింది. ఈ ట్రైలర్‌లో చూపించిన కొన్ని సన్నివేశాలు జవాన్ చిత్రంపై ఆశలను తగ్గించిందని అంటున్నారు సినీ ప్రేక్షకులు. దీనికి కారణం.. ట్రైలర్‌లో చూపించిన సన్నివేశాల్లో సినిమా పూర్తి స్టోరీని చెప్పేయడమే.
అవును.. జవాన్ ట్రయిలర్ లో ఆల్ మోస్ట్ అంతా చూపించేశారు. “యుద్ధం మొదలయ్యాక పక్కోడు పోయాడా.. వెనకోడు ఆగిపోయాడా..” అంటూ సాయిధరమ్ తేజ్ చెప్పే డైలాగ్‌లు, అలాగే, ఆక్టోపస్ మిస్సైల్ సైన్యానికి దక్కకుండా, తనకే దక్కేలా విలన్ పలికే డైలాగ్‌లతోపాటు హీరోయికి తండ్రి ఇచ్చే భరోసా ఇలా పలు సన్నివేశాలతో రిలీజైన జవాన్ ట్రైలర్ సినిమా ఏంటనేది చెప్పేస్తోంది. ఇలా ఇంట్రస్టింగ్‌ను క్రియేట్ చేయకుండా జవాన్ ట్రైలర్ ఉండటంతో చిత్ర దర్శకుడు బీవీఎస్ రవిపై పెదవి విరుస్తున్నారు మెగా ఫ్యాన్స్.