టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్ .ఇటు తన అందంతో అటు అభినయం తో యువత దగ్గర నుండి సినిమా ప్రేక్షకుల వరకు అందరి మదిని దోచుకుంది ఈ ఢిల్లీ అందాల రాక్షసి .వరస విజయాలతో ఇండస్ట్రీలో ముందుకు దూసుకుపోతుంది .రకుల్ ఇటీవల ప్రముఖ వార్తాపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది .
ఆ ఇంటర్వ్యూ లో ఇండస్ట్రీలో నిన్న మొన్నటివరకు స్టార్ హీరోయిన్లలో ఒకరుగా ఒక వెలుగు వెలిగిన సీనియర్ స్టార్ హీరోయిన్ నయనతారతో మిమ్మల్ని పోల్చుకుంటారా అని అడిగారు .అంతే అమ్మడు అంత ఎత్తున లేచి సమాధానమిస్తూ నయన ఒక సీనియర్ నటి .ఆమె తన నటనతో పలు భాషల్లో ఉత్తమ నటిగా నిరూపించుకుంది .
ఇంకా తనకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి .అయితే ఆమెకు వచ్చిన పాత్రలు తనకు రాలేదని ఆమె అన్నారు .అయితే నటిని బట్టే పాత్రలు కొన్ని సృష్టించబడతాయి .అందుకే నయనకు అలాంటి పాత్రలు వస్తున్నాయి అని రకుల్ చెప్పుకొచ్చారు .