Home / SLIDER / నేను కూడా మీలానే గౌరవంగా భావిస్తున్నాను కేటీఆర్‌ బ్రదర్‌..నాని

నేను కూడా మీలానే గౌరవంగా భావిస్తున్నాను కేటీఆర్‌ బ్రదర్‌..నాని

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని  విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో ఓ విద్యార్థి ఇచ్చిన ప్రెజెంటేషన్‌పై తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, హీరో నానిలు స్పందించారు. గీతం యూనివర్సిటీలో మై రోల్ మోడల్‌ అంశంపై తనకు రోల్ మోడల్‌లుగా ఉన్న కేటీఆర్‌, నానిలపై ఓ విద్యార్థి ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. విద్యార్థులకు ఓ రాజకీయనాయకుడు ఆదర్శంగా నిలవడం చూస్తుంటూ ఆశ్చర్యంగానూ, చాలా ఆనందంగానూ ఉందని సదరు విద్యార్థి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మీ పనితీరుతో మరింత మందికి ఆదర్శంగా నిలవాలని ఆశిస్తున్నాను అని కేటీఆర్‌ను ట్యాగ్‌ చేశారు.మై రోల్ మోడల్‌ ప్రెజెంటేషన్‌లో కేటీఆర్‌, నానిల ఫోటోలు పక్క పక్కనే ఉన్నాయి.

ఇది గమనించిన కేటీఆర్‌ విద్యార్థి ట్వీట్‌కు బదులిస్తూనే హీరో నానిని కూడా ట్యాగ్‌ చేశారు.” వావ్‌, ఎక్కడ జరిగిందో గానీ, చాలా గౌరవంగా భావిస్తున్నాను. ప్రెజెంటేషన్‌లో నాకు మంచి కంపెనీగా నాని ఉన్నారు”… అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.దీనికి హీరో నాని కూడా స్పందిస్తూ .. ” నేను కూడా మీలానే గౌరవంగా భావిస్తున్నాను కేటీఆర్‌ బ్రదర్‌ “ అని ట్వీట్‌ చేశారు. ఆ ఫోటో చాలా ఆనందాన్నిచ్చింది… అంటూ కృతజ్ఞతలు తెలిపారు. నాని చేసిన ట్వీట్‌ను కేటీఆర్‌ లైక్‌ చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino