కనీస వసతుల్లేని మారుమూల పల్లెలో పుట్టాడు. ఊళ్లోని సర్కారీ బడిలో చదువుకున్నాడు. అయితేనేం… అతని పట్టుదల ఉన్నత శిఖరాలకు చేర్చింది. హైదరాబాద్ వస్తున్న ఇవాంకా ట్రంప్ బృందంలో ఆయన కూడా ఉన్నారు. ఆయనెవరో కాదు మన తెలంగాణ బిడ్డ రవి పులి.అమెరికా వర్జీనియాలో స్థిరపడ్డ రవి స్వగామ్రం జయశంకర్ జిల్లా తాడ్వాయి మండలం మారుమూల పల్లె కాటాపూర్. ఇక్కడ కనీస వసతులు కూడా లేని పరిస్థితిలో ఆయన ఒక్కొక్క మెట్టే అధిరోహిస్తూ వెళ్లాడు. ఆయన ఇంటర్నేషనల్ సొల్యూషన్స్ గ్రూప్ వ్యవస్థాపక సీఈవో, ప్రెసిడెంట్. 1997లో అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఆయన ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత సొంతంగా సంస్థలు స్థాపించాడు. ఈనెల 28, 29 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన పాల్గొంటున్నారు.