తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మరోమారు తన పెద్ద మనసు చాటుకున్నారు. దళితులపై అకారణంగా బీజేపీ నేతలు దాడికి పాల్పడగా…బాధితుల పక్షాన నిలిచి వారిలో మనోధైర్యాన్ని నింపారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం అభంగపట్నంకు చెందిన లక్ష్మణ్, రాజేష్‌పై బీజేపీ నేతలు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 2వ తేదీన గ్రామ చెరువులో అక్రమంగా మొరం తీస్తున్న బిజెపి నాయకుడు భరత్ రెడ్డి ని లక్ష్మణ్, రాజేష్ లు అడ్డుకున్నారని, జీర్ణించుకోలేని భరత్ రెడ్డి దాడి చేసి, నీటి గుంటలో మునగమని ఆదేశించారని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.


ఈ బెదిరింపు జరిగిన అనంతరం కిడ్నాప్ కు గురయిన ఇద్దరు దళితుల కుటుంబ సభ్యులు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ను కలిశారు. తెలంగాణ ఎమ్మార్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఆచూకీ లేని కొండా లక్ష్మణ్ భార్య భావన, తల్లి నర్సమ్మ, బచ్చల రాజేష్ భార్య లత ఎంపి కవితను కలిశారు. భరత్ రెడ్డి దాడి చేసిన ఉదంతం ఆయన మనుషులు తీసిన వీడియో ద్వారా తమకు తెలిసిందన్నారు. అప్పటి నుంచి తమ భర్తలు కనిపించడం లేదని, భరత్ కిడ్నాప్ చేశాడని పోలీస్ లకు కంప్లయింట్ ఇచ్చామని చెప్పారు. భరత్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయించాలని ఈ సందర్బంగా ఎమ్మార్పీఎస్ నాయకులు కవిత ను కోరారు.
బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని ఎంపి కవిత రాజేష్, లక్ష్మణ్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బీజేపీ నేత భరత్ ను పట్టుకునే పనిలో పోలీస్ లు ఉన్నారన్నారు. తెలంగాణ ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు యాతాకుల భాస్కర్ మాదిగ,జాతీయ ప్రధాన కార్యదర్శి మేడి పాపయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు రేణిగుంట నాంపల్లి, మహిళా నాయకురాలు సిరిమల పోసాని, అధికార ప్రతినిధి కొక్కెర భూమన్న, నాయకులు తెడ్డు పోశెట్టి,రొడ్డ సుధాకర్ ఎంపి కవితను కలిసిన వారిలో ఉన్నారు.
Post Views: 256