భారత దేశ పర్యటనలో ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు సినీ నటి పూనమ్ కౌర్ ప్రత్యేక కానుక ఇచ్చారు. పర్యటనలో భాగంగా ఢిల్లీలో హిందుస్తాన్ టైమ్స్ నిర్వహించి లీడర్‌షిప్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఇదే కార్యక్రమానికి వెళ్లిన పూనమ్, ఒబామాను కలిశారు. ఈ సందర్భంగా పూనమ్ చేనేత వస్త్రాలను ఒబామాకు బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను పూనమ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. తన జీవితంలో మర్చిపోలేని సంఘటన అని.. తాను ఆదర్శంగా భావించే వ్యక్తి బరాక్ ఒబామా అని తెలిపింది. ఆయనకు చేనేత వస్త్రాలు కానుకగా ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.
The best moment of my life …. gifted handlooms to the man I admire #barackobama
Posted by Poonam Kaur on Friday, 1 December 2017