మంత్రి కేటీఆర్ ఇవాళ మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం శివారులోని క్రిస్టియన్‌పల్లిలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్లను 310 మంది లబ్ధిదారులతో మంత్రి కేటీఆర్ సామూహిక గృహ ప్రవేశం చేయించారు.
Ministers Laxma Reddy @KTRTRS attended house warming ceremony of 2BHK houses at Mahabubnagar along with MP Jithender Reddy, MLA @VSrinivasGoud. 310 beneficiaries are ready to occupy the 2BHK houses from today. pic.twitter.com/9jjLs9YX3m
— Min IT, Telangana (@MinIT_Telangana) December 4, 2017
గృహ ప్రవేశాల అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ .. రాష్ట్రంలోని నిరుపేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మించి ఇస్తామని స్పష్టం చేశారు. కలెక్టర్ ముందే లాటరీ తీసి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేశామన్నారు. దేశంలో ఇలాంటి కార్యక్రమం ఎక్కడా జరగడం లేదన్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని మంత్రి తెలిపారు. గతంలో ఇండ్లు కడితే లబ్దిదారులు అప్పుల పాలయ్యేవారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. పైసా ఖర్చు లేకుండా ఉచితంగా ప్రభుత్వమే ఇండ్లు కట్టించి ఇస్తుందని చెప్పారు. పేదలు ఆత్మగౌరవంతో బతికేందుకే డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణామని కేటీఆర్ పేర్కొన్నారు.రాష్ట్రంలో 2 లక్షల 72 వేల డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
A few more glimpses from 2BHK house warming ceremony, Mahabubnagar. pic.twitter.com/pmW30h0Stg
— Min IT, Telangana (@MinIT_Telangana) December 4, 2017