ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గతంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అప్పటి టీటీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేత సహచర ఎమ్మెల్యే అయిన స్టీఫెన్సన్ కు యాబై లక్షలు ఇస్తూ అడ్డంగా దొరికిన కేసులో ముద్దాయిగా ఉన్నాడని వార్తలతో పాటుగా ..బాబు సదరు ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడిన వాయిస్ ఆడియో టేఫులు కూడా బయటకు వచ్చాయి.
అయితే ప్రస్తుతం ఆ కేసు కోర్టులో పెండింగ్ ఉంది .తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఎమ్మెల్యేకు ఆరు వందల కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు అని ఒక వార్త వెలుగులోకి వచ్చింది .గతంలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే టీడీపీలో చేరితే వంద కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తామని ఆయన మీడియాకు తెలిపిన సంగతి తెల్సిందే .తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చిన్ననాటి మిత్రుడు ,రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే అయిన శ్రీకాంత్ రెడ్డికి బాబు ఆరు వందల కోట్ల ను ఆఫర్ చేశారు అని వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి .
అయితే ,ప్రస్తుతం వైసీపీలో బలమైన నేతగా ,జగన్ కు అండగా ఉన్న శ్రీకాంత్ రెడ్డిను టీడీపీలో చేర్చుకుంటే ఆ పార్టీ బలహీనమవుతుంది అని బాబు ప్రణాళికలు సిద్ధం చేశారు అని..కానీ నీతి నిజాయితీగా ఉండే శ్రీకాంత్ రెడ్డి ముందు బాబు కుప్పిగంతులు నడవలేదు అని ..అందుకే శ్రీకాంత్ రెడ్డి లొంగలేదు అని కూడా వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో కోడై కూస్తున్నాయి .అంతే కాదు ఈ డీల్ మాట్లాడటానికి ఏకంగా బాబే స్వయంగా రంగంలోకి దిగారు అని కూడా సమాచారం .అయితే ప్రస్తుతం ఒక్క ఎమ్మెల్యే కోసం ఆరు వందల కోట్ల రూపాయలను ప్రకటించడం సంచలనంగా మారింది ..